ఆక్లాండ్ టీ20లో మీటూ ప్రకంపనలు...

By Arun Kumar PFirst Published Feb 9, 2019, 1:28 PM IST
Highlights

భారత్-న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ వేదికన జరిగిన రెండో టీట్వంటీ లో మీటూ ప్లకార్డుల ప్రదర్శన ప్రకంపనలు సృషిస్టోంది. ఈ వన్డేలో కొందరు మహిళలు ఓ న్యూజిలాండ్ ఆటగాడికి వ్యతిరేకంగా ఈ మీటూ ప్లకార్డులను ప్రదర్శించినట్లు తెలుస్తోంది. మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన క్రికెటర్ కు న్యూజిలాండ్ జట్టులో స్థానం కల్పించడం మహిళల ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో వారు ఏకంగా స్టేడియంలోనే నిరసనకు దిగారు.

ఆక్లాండ్ మైదానంలో టీంఇండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కొందరు మహిళలు ''న్యూజిలాండ్ క్రికెట్ మేలుకో #మీటూ'' (Wake up,NZ Cricket,#MeToo)అని రాసి వున్న ప్లకార్డులను ప్రదర్శించారు. అయితే వెల్లింగ్టన్ లో జరిగిన టీ20లో కూడా ఓ మహిళ ఇలాగే ప్లకార్డును ప్రదర్శించగా సెక్యూరిటీ సిబ్బంది ఆమెను మైదానం నుండి బయటకు పంపించారు. దీంతో గ్రౌండ్ నిర్వహకులపై తీవ్ర రావడంతో రెండో టీ20 లో ఆ పని చేయలేదు. కానీ ఈ వ్యవహారం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు పెద్ద సమస్యగా మారింది.      

ఇంతకూ ఈ నిరసన ఎవరి గురించి అనుకుంటున్నారా?కివీస్ ఆల్‌రౌండర్‌ స్కాట్‌ కుగ్‌లీన్‌ కు వ్యతిరేకంగా ఈ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అతడిపై 2017 లో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడినట్లు కేసు నమోదయ్యింది. అయితే అతడే నిందితుడని నిర్ధారణ కాకపోవడంతో నిర్దోశిగా బయటపడ్డాడు. అయితే ఇలా రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆటగాడిని అంతర్జాతీయ  జట్టులో స్థానం కల్పించడం న్యూజిలాండ్ మహిళల ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో వారు ఏకంగా మైదానంలోనే నిరసన తెలుపుతున్నారు.   

click me!