IPL హిస్టరీలో అరుదైన ఘనత సొంతం చేసుకున్న శ్రేయస్‌ అయ్యర్‌!

Published : Jun 02, 2025, 05:10 AM IST
Shreyas Iyer. (Photo- IPL)

సారాంశం

శ్రేయస్ అయ్యర్ ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరింది. మూడు జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.

 

పంజాబ్ కింగ్స్ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు ఈ జట్టు మరోసారి అడుగుపెట్టింది. ఐపీఎల్ 2025 సీజన్ రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌ను పంజాబ్ బలంగా ఓడించింది. ఈ విజయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడుతూ అజేయంగా నిలిచాడు.

ఐపీఎల్ చరిత్రలోనే..

ఈ గెలుపుతో శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించాడు. ఇప్పటి వరకు మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా ఫైనల్‌కు చేర్చిన ఏకైక ఆటగాడిగా ఆయన నిలిచాడు. 2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు, 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహించిన శ్రేయస్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌ను టైటిల్ పోరుకు తీసుకొచ్చాడు. మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేయడం పంజాబ్ యాజమాన్యానికి న్యాయం చేసినట్లు ఈ విజయంతో స్పష్టమైంది.

ప్రశాంతంగా ఉండటం

ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన శ్రేయస్, భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ప్రశాంతంగా ఉండటం అవసరమని చెప్పారు. తొలుత క్రీజ్‌లో స్థిరపడేందుకు కొంత సమయం తీసుకున్నానని, అదే సమయంలో సహచర బ్యాటర్లు స్కోరు పెంచారని పేర్కొన్నాడు. మొదటి క్వాలిఫయర్‌లో ఓడినా, అది తాము మరిచిపోయామని, ఒకే ఒక్క మ్యాచ్‌తో జట్టును కొలవలేమని అన్నాడు.

వరుసగా ఆరో ఓటమి..

ఇక ముంబయి ఇండియన్స్‌కు ఇది తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు 200+ స్కోరు చేసిన 19 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించిన ముంబయి, ఇప్పుడు ఓటమిని చవిచూసింది.అంతేకాకుండా, అహ్మదాబాద్ మైదానంలో ముంబయికి ఈసారి మరో నిరాశ ఎదురైంది. అక్కడ వరుసగా ఆరో ఓటమి నమోదైంది. చివరిసారి 2014లో మాత్రమే ఇక్కడ విజయం సాధించింది. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో 204 పరుగుల లక్ష్య ఛేదన అత్యధికం కావడం విశేషం.

ఈ సీజన్‌కు హైలైట్‌…

మొత్తానికి, శ్రేయస్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ మరోసారి ఫైనల్‌కు చేరడం, ముంబయిపై ఆ జట్టు చరిత్రాత్మక విజయం సాధించడం ఈ సీజన్‌కు హైలైట్‌గా నిలిచాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే