ఏషియన్ గేమ్స్: భారత్ ఖాతాలో మరో పతకం

By Arun Kumar PFirst Published Aug 20, 2018, 12:35 PM IST
Highlights

ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. ఈ క్రీడలు ఆరంభమైన రోజే భారత్ రెండు పతకాలతో ఖాతా తెరిచింది. తాజాగా రెండోరోజు కూడా క్రీడాకారులు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇండియన్ షూటర్ దీపక్ కుమార్ తన అత్యుత్తమ ప్రదర్శనతో సిల్వర్ మెడల్ ను కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మూడో పతకం చేరింది. 

ఆసియా క్రీడల మొదటి రోజు కూడా ఇదే షూటింగ్ ఈవెంట్లో భారత్ పసిడి పతకం సాధించింది.  10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో భారత షూటర్లు అపూర్వి  చండేలా, రవి కుమార్ కాంస్య పతకాన్ని గెల్చుకున్నారు. అంతేకాకుండా పురుషుల 65కిలోల ఫ్రీస్టెల్ రెజ్లింగ్‌లో బజ్‌రంగ్ పూనియా పసిడి పతకం సాధించారు.

ఇక ఇవాళ జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో  భారత షూటర్ దీపక్ కుమార్ సిల్వర్ మెడల్‌ను గెలుచుకున్నాడు.  దీపక్ ఫైనల్లో 247.7 పాయింట్లతొ రెండో స్ధానంలో నిలిచి సిల్వర్ మెడల్ పొందాడు. ఇతడి కంటే మెరుగైన ప్రదర్శనతో చైనా క్రీడాకారుడు హరోన్ యాంగ్ 249.1 పాయింట్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తైపీ క్రీడాకారుడు షావోచువాన్ లు 226.8 పాయింట్లు సాధించి రజత పతకాన్ని సాధించాడు.  

Indian Shooter Deepak Kumar who has won a silver medal in Men's 10m Air Rifle event at pic.twitter.com/v0MwEvsyFR

— ANI (@ANI)

click me!