నేనేం కపిల్ దేవ్ అవ్వాలనుకోలేదు.. పాండ్యా పంచ్

By ramya neerukondaFirst Published Aug 20, 2018, 12:27 PM IST
Highlights

పాండ్యా వేసిన పంచ్.. కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే కాదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కాకుండా ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని భజ్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 

తనపై కామెంట్స్ చేసిన వారికి సరైన సమయంలో సరైన పంచ్ వేశారు.. టీం ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. తానెప్పుడూ కపిల్ దేవ్ లాగా అవ్వాలని అనుకోలేదని ఆయన పేర్కొన్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే...నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టు రెండో రోజు ఆటలో పాండ్య ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో మరోసారి అభిమానులు అతడ్ని మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌తో పోల్చడం మొదలుపెట్టారు.

దీనిపై హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ...‘‘నేను ఎప్పటికీ కపిల్‌దేవ్‌ అవ్వాలని అనుకోవట్లేదు. నన్ను హార్దిక్‌ పాండ్యలాగే ఉండనీయండి. ఇలాగే చాలా బాగున్నాను. కపిల్‌దేవ్‌లా కాదు హార్దిక్‌ పాండ్యలా 41 వన్డేలు, 10 టెస్టులు ఆడాను. పోల్చడం మంచిదే. కానీ, ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోతే అవన్నీ మారిపోతాయి. దయచేసి ఒకర్ని మరోకరితో పోల్చడం ఆపండి. ఇదే జరిగితే నేను ఎంత సంతోషిస్తానో నాకే తెలుసు. నేను నా దేశం కోసం ఆడుతున్నాను. నా ప్రదర్శన పట్ల నా జట్టు సంతోషంగానే ఉంది.’’ అని పేర్కొన్నారు.

అయితే.. పాండ్యా వేసిన పంచ్.. కేవలం అభిమానులను ఉద్దేశించి మాత్రమే కాదని తెలుస్తోంది. ఈ మ్యాచ్ కాకుండా ముందు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో హార్దిక్ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడి నుంచి ఆల్‌రౌండర్ అనే ట్యాగ్ తొలగించాలని భజ్జీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.

హార్దిక్ కపిల్ దేవ్ లాంటి ఆల్‌రౌండర్ కాదు. వరల్డ్ క్లాస్ ఆల్‌రౌండర్‌గా మారడానికి హార్దిక్ ఎంతో దూరంలో ఉన్నాడు. మరో మంచి ఆల్‌రౌండర్ కోసం భారత్ వెతుక్కోవడం బెటరని వెస్టిండీస్ మాజీ ఆటగాడు మైకెల్ హోల్డింగ్ చురకలు అంటించాడు.  ఈ వ్యాఖ్యలన్నీ గుర్తించుకునే పాండ్యా ఇలా మాట్లాడని పలువురు భావిస్తున్నారు.

click me!