కోహ్లీ రికార్డుకి బ్రేకులు వేసిన శిఖర్ ధావన్

Published : Nov 22, 2018, 09:50 AM IST
కోహ్లీ రికార్డుకి బ్రేకులు వేసిన శిఖర్ ధావన్

సారాంశం

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని శిఖర్ ధావన్ బ్రేక్ చేశారు

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుని శిఖర్ ధావన్ బ్రేక్ చేశారు. టీ 20ల్లో ఒక సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా ధోని రికార్డ్ సొంతం చేసుకున్నారు. గతంలో ఈ రికార్డ్ కోహ్లీ పేరిట ఉండగా.. ఇప్పుడది ధావన్ సొంతమైంది. బుధవారం ఆసీస్  తో టీం ఇండియా తలపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో భారత్ 4పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది. అయితే.. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్  అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు.

లక్ష్యచేదనలో రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సారథ విరాట్‌ కోహ్లిలు విఫలమైనా ధావన్‌(42 బంతుల్లో 76; 10ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థ శతకంతో రాణించాడు. అయితే ఆసీస్‌పై ఆడిన చక్కటి ఇన్నింగ్స్‌కు ధావన్‌ ఖాతాలో సరికొత్త రికార్డు చేరింది. 

టీ20ల్లో ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్‌ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇప్పటివరకు పొట్టి ఫార్మట్‌ క్రికెట్‌లో ఒక క్యాలెండ్‌ సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో) పేరిట ఉన్న రికార్డును తాజాగా ధావన్‌ అధిగమించాడు. 

PREV
click me!

Recommended Stories

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్