బ్రిస్బేన్ టీ20: ఉత్కంఠ పోరులో భారత్ "కంగారు"

By sivanagaprasad kodatiFirst Published Nov 21, 2018, 1:31 PM IST
Highlights

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇవాళ బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లను పొగొట్టుకుంది. 

ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో భారత  జట్టు పరాజయం పాలయ్యింది. ఉత్కంటభరితంగా సాగిన ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ ని ఆసిస్ బౌలర్లు కంగారెత్తించారు. 17 ఓవర్లలో 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి ఓటమిపాలయ్యింది.4 పరుగుల  స్వల్ప తేడాతో భారత్ పై ఆసిస్ విజయం సాధించింది.

భారత జట్టులో శిఖర్ ధావన్ 76 పరుగులు 42 బంతుల్లో,ధినేశ్ కార్తిక్ 30 పరుగులు 13 బంతుల్లో చెలరేగి ఆడటంతో భారత్ మొదట విజయం వైపు అడుగులేసింది. అయితే చివరి ఓవర్లలో భారత్ వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో ఓటమిపాలయ్యింది.చివరి ఓవర్లో ఆసీస్ బౌలర్ స్టెయినీస్ రెండు వికెట్లు పడగొట్టి టీంఇండియా ఓటమికి కారణమయ్యాడు. 

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఇవాళ ఆరంభమైన మొదటి టీ20 లో ఆస్ట్రేలియా బ్యాట్ మెన్స్ అదరగొట్టారు. ఆస్ట్రేలియా జట్టులో మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 46, స్టాయినిస్ 19 బంతుల్లో 33 పరుగులు,లిన్, (37), ఫించ్ (27) లు రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. అయితే ఆటకు కాస్సేపు వర్షం అడ్డంకి సృష్టించింది, దీంతో డక్ వర్త్ లూయిస్ పద్దతిలో  టీమిండియా లక్ష్యాన్ని 17 ఓవర్లలో 174 పరుగులుగా నిర్దేశించారు. 

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఇవాళ బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఆసీస్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప పరుగుల తేడాతో మూడు కీలక వికెట్లను పొగొట్టుకుంది.

ఖలీల్ అహ్మద్ ధాటికి ఓపెనర్ షార్ట్ పెవిలియన్ చేరగా.. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించిన ఫించ్, క్రిస్ లైన్‌ కూడా ఖలీల్ బౌలింగ్‌‌లో అవుట్ అయ్యారు. ప్రస్తుతం ఆసీస్ 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది.. మ్యాక్స్‌వెల్ 4, మార్కస్ స్టోనీస్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకు ముందు టాస్  గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కే అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ఆసీస్‌ను బ్యాటింగ్‌‌కు ఆహ్వానించినట్లు కోహ్లీ తెలిపాడు. ఎప్పటిలాగే మ్యాచ్‌కు ముందుగానే తుదిజట్టును భారత్ ప్రకటించింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, శిఖర్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య, భువనేశ్వర్‌, కుల్దీప్‌ యాదవ్‌, బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌

click me!