
Asia Cup 2023: ఉపఖండ దేశాలు మినీ వరల్డ్ కప్(Mini World Cup)గా భావించే ఆసియా కప్ 2023(Asia Cup 2023) జోరుగా సాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శనివారం ఓ హోరాహోరీ మ్యాచ్ జరుగనున్నది. అదే భారత్ - పాక్ ల మధ్య జరిగే కీలక పోరు. బుధవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్.. పసికూన నేపాల్‌ను మట్టికరిపించింది. ఆ గెలుపు ఉత్సాహంతో ఉన్న పాకిస్థాన్.. భారత్‌తో శనివారం తలపడనుంది. శ్రీలంక వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌కు ముందే పాకిస్తాన్‌కు ఊహించని షాక్ తగలింది.
నేపాల్ పాక్ ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ స్టార్ పేసర్ షహీన్ షా అఫ్రిది గాయపడ్డారు. అదే సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో అఫ్రిది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అనంతరం ఫిజియో సలహా మేరకు గ్రౌండ్ విడిచి పెవిలియన్ కు వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్లో 5 ఓవర్లు వేసిన ఆఫ్రిది 27 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే భారత్ లో జరగనున్న మ్యాచ్ కు మరో మూడు రోజుల సమయం ఉండడంతో అఫ్రిది కోరుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదిలా ఉంటే మినీ ప్రపంచ కప్ అయినా ఆసియా కప్ లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. పసికూన నేపాల్ ను చిత్తుగా ఓడించి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నేపాల్ ముందు పెట్టింది. అనంతరం లక్ష్య చేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులు చేసి కుప్పకూలింది.