జాతి వ్యతిరేక వ్యాఖ్యలు: ఫలించిన ఇంజమామ్ కృషి, సర్పరాజ్‌కు తగ్గిన శిక్ష

By sivanagaprasad kodatiFirst Published Jan 28, 2019, 8:17 AM IST
Highlights

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫెలుక్ వాయో రంగును ఉద్దేశిస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) వేటు వేసిన సంగతి తెలిసిందే. చేసిన నేరానికి శిక్షగా అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధిస్తూ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 

దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫెలుక్ వాయో రంగును ఉద్దేశిస్తూ పాకిస్తాన్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలపై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) వేటు వేసిన సంగతి తెలిసిందే. చేసిన నేరానికి శిక్షగా అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధాన్ని విధిస్తూ ఐసీసీ ఆదేశాలు జారీ చేసింది.

అయితే నిజానికి అతనికి దాదాపు ఎనిమిది మ్యాచ్‌ల వరకు నిషేధం విధించాలని ఐసీసీ పెద్దలు నిర్ణయించారట. కానీ పాక్ మాజీ కెప్టెన్, చీఫ్ సెలక్టర్ ఇంజమామ్ ఉల్ హక్ కృషి వల్ల అతని శిక్ష తీవ్రత తగ్గిందట. జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన తర్వాత సర్ఫరాజ్ మీడియా సమావేశంతో పాటు ట్వీట్టర్ సాక్షిగా క్షమాపణలు చెప్పాడు.

దీంతో పాటు వెంటనే రంగంలోకి దిగిన ఇంజమామ్ సౌతాఫ్రికా జట్టులోని హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్‌తో మాట్లాడి, మరింత ఉద్రిక్తతను పెంచొద్దని విజ్ఞప్తి చేశాడట. సర్ఫరాజ్ వ్యాఖ్యలపై జట్టు సభ్యులంతా మూకుమ్మడిగా ఫిర్యాదు చేయకుండా ఈ ముగ్గురు ఒప్పించారని పీసీబీ వర్గాలు అంటున్నాయి.

నేరుగా ఫిర్యాదు చేసుంటే శిక్ష మరింత పెరిగేది. డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో బ్యాటింగ్ చేస్తోన్న ప్రోటీజ్ ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియా నలుపు రంగును ఉద్దేశిస్తూ కీపర్‌గా ఉన్న సర్ఫరాజ్ జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది.. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్ ’’ అంటూ ఉర్దూలో మాట్లాడిన మాటలు స్టంప్స్ మైక్‌లో రికార్డయ్యాయి. దీనిపై క్రికెట్ ప్రపంచంతో పాటు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

చేసిన తప్పును ఒప్పుకున్న పాక్ కెప్టెన్ ఆ తర్వాతి రోజు క్షమాపణలు కోరాడు. ‘‘తాను ఉద్దేశ్యపూర్వకంగా ఆ మాటలు అనలేదని, ఎవరినీ బాధపెట్టే ఉద్దేశ్యం తనకు లేదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహచర క్రికెటర్లను తాను ఎల్లప్పుడూ గౌరవిస్తానన్నాడు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే మన్నించండి అంటూ ట్వీట్ చేశాడు.

అయితే జరిగిన సంఘటనపై దక్షిణాఫ్రికా జట్టు కానీ, బోర్డు కానీ ఫిర్యాదు చేయకపోయినప్పటికీ ఐసీసీ మాత్రం స్వతంత్ర విచారణ చేపట్టింది. నిబంధనావళి ప్రకారం... మైదానంలో ఆటగాళ్లను, వారి కుటుంబాన్ని కించపరచడం, దూషించడం నేరం. దీని ప్రకారం సర్ఫరాజ్‌పై రెండు వన్డేలు, రెండు టీ20లపై నిషేధం విధించింది. 

జాతి వివక్ష వ్యాఖ్యలు: పాక్ కెప్టెన్‌ సర్ఫరాజ్‌పై వేటు... క్షమాపణలు చెప్పినా

‘‘మేం క్షమించాం.. కానీ’’: సర్ఫరాజ్ వ్యాఖ్యలపై డుప్లిసెస్ కామెంట్స్

‘‘ఏయ్ నల్లోడా.. మీ అమ్మ’’ అంటూ పాక్ కెప్టెన్ వివాదాస్పద వ్యాఖ్యలు

click me!