ఇండోనేషియా మాస్టర్స్ విజేత సైనా

sivanagaprasad kodati |  
Published : Jan 27, 2019, 04:23 PM IST
ఇండోనేషియా మాస్టర్స్ విజేత సైనా

సారాంశం

ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ , తెలుగుతేజం సైనా నెహ్వాల్ విజయం సాధించారు. జకార్తాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో తలపడిన సైనా... తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినాను ఎదుర్కోవడం నెహ్వాల్‌ వల్ల కాలేదు

ఇండోనేషియా మాస్టర్స్ ఛాంపియన్ టోర్నీ విజేతగా భారత బ్యాడ్మింటన్ స్టార్ , తెలుగుతేజం సైనా నెహ్వాల్ విజయం సాధించారు. జకార్తాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్‌తో తలపడిన సైనా... తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన కరోలినాను ఎదుర్కోవడం నెహ్వాల్‌ వల్ల కాలేదు.

7-2 ఆధిక్యంలో ఉన్న సమయంలో కరోలినా కాలికి గాయడం కావడంతో ఆమె ఆడటంలో ఇబ్బంది పడింది. ప్రాథమిక చికిత్స అనంతరం మ్యాచ్ ప్రారంభించిన కరోలినా మరో రెండు పాయింట్లు సాధించింది.

అనంతరం మరోసారి గాయం తిరగబెట్టడంతో ఫైనల్ పోరు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో నిర్వాహకులు సైనాను విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో 10-4తో ముందంజలో ఉన్నప్పటికీ కరోలినా పరాజయం పాలవ్వడం దురదృష్టకరం. మలేషియా మాస్టర్స్ సెమీఫైనల్‌లో సైనా-కరోలినా తలపడగా... కరోలినా పైచేయి సాధించింది.
 

PREV
click me!

Recommended Stories

T20I Fastest Fifties: భారత్ తరఫున మెరుపు హాఫ్ సెంచరీలు బాదిన టాప్ 5 ప్లేయర్లు వీరే
Abhishek Sharma : ఇదేం బాదుడురా సామీ.. యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్