Saina Nehwal-Kashyap : హైదరబాదీ బ్యాడ్మింటన్ జంట విడాకులు

Published : Jul 14, 2025, 08:49 AM ISTUpdated : Jul 14, 2025, 09:11 AM IST
Saina-Nehwal-P-Kashyap-separation

సారాంశం

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 

హైదరాబాద్ టెన్నిస్ స్టార్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ వివాహ బంధానికి తెరపడింది. విడాకులు తీసుకోనున్నట్లు సోషల్ మీడియా వేదికన సైనా నెహ్వాల్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్ఫష్టం చేశారు. 

''జీవితం  కొన్నిసార్లు మనల్ని విభిన్న మార్గాల్లో తీసుకెళుతుంది. చాలా ఆలోచించాకే కశ్యప్ తో విడాకుల నిర్ణయం తీసుకున్నాను. ఇద్దరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాము. జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాము. ఈ సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాం'' అటూ సైనా నెహ్వాల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.

గుంటూరు జిల్లాకు చెందిన పారుపల్లి కశ్యప్ భారత్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక సైనా నెహ్వాల్ కూడా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. భారత్ తరపున ఆమె ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. కారణాలేంటో తెలీదుగానీ ఇప్పుడు విడాకులు తీసుకున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది