
Heinrich Klaasen Special interview : దక్షిణాఫ్రికా క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి తన రిటైర్మెంట్ ను ప్రకటిస్తూ, ఆధునిక క్రికెట్ లో అపార శక్తివంతమైన బ్యాట్స్ మెన్ గా అత్యంత కీలకమైన అధ్యాయానికి ముగింపు పలికాడు. 33 ఏళ్ల వయసులో, అతను అంతర్జాతీయ వేదికకు దూరం అవుతున్నాడు. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), SA20, ఇంగ్లాండ్ ద హండ్రెడ్ తో పాటు, ప్రపంచవ్యాప్తంగా జాతీయ లీగ్ లలో ఆడడం మాత్రం అతను కొనసాగిస్తాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తన ఆఖరి మ్యాచ్ ను క్లాసెన్ ఆడగా, దీనిని తన అంతర్జాతీయ కెరీర్ కు ఎంతో విలువైన ముగింపుగా చెప్పవచ్చు. రాబోయే క్లబ్ యాక్షన్ తో పాటు ఈ స్టార్ ప్లేయర్ కనీసం మరో 3 సంవత్సరాలు ఆడడం కొనసాగించడానికి ప్రణాళికలు చేసుకున్నాడు.
1xBet బెట్టింగ్ కంపెనీకి అంబాసిడర్ అయిన హెన్రిచ్ క్లాసెన్, ఈ నిర్ణయం గురించి తన అభిమానులతో సందేశాన్ని పంచుకున్నాడు.
"ఇవాళ నాకు బాధాకరమైన రోజు. రాబోయే కాలంలో నాకు, నా కుటుంబానికి ఏది ఉత్తమమైనదో నిర్ణయం తీసుకోవడానికి నాకు సమయం పట్టింది" అంటూ తన వీడ్కోలు ప్రకటనలో భాగంగా అతను పేర్కొన్నాడు.
ప్రపంచ క్రికెట్ లో అత్యంత దూకుడును ప్రదర్శించే బ్యాటర్లలో ఒకడిగా క్లాసెన్ గుర్తింపు సంపాదించుకున్నాడు. అతని శక్తివంతమైన షాట్లు, ఆటతీరును మార్చగల సామర్థ్యాలు అతనిని దక్షిణాఫ్రికా జాతీయ జట్టులో, ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో అతనిని కీలక భాగంగా చేశాయి.
క్లాసెన్ కెరీర్లో అత్యంత చిరస్మరణీయ క్షణాలలో ఒకటిగా, సెంచూరియన్ లో 83 బంతులలో కొట్టిన 174 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఆ ఇన్నింగ్స్ అతిగొప్ప ఇన్నింగ్లలో ఒకటిగా నిలిచిపోయియింది. దూకుడు, ఆత్మవిశ్వాసం, చూసేందుకు ఉద్విగ్నతభరితమైన ఆ ఇన్నింగ్స్ కొనసాగించడంలో క్లాసెన్ శైలిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకుంది. 2023 క్రికెట్ ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్ కు చేరడంలో, అలాగే 2024 టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ కు చేరడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు.
ఒత్తిడి అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు, ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాల్సిన సమయంలో, అలాగే గట్టి పోటీలలో విజయాన్ని దక్కించుకోవలసిన తరుణంలో, హెన్రిచ్ ప్రతిభ తారాస్థాయిలో వెలిగిపోతుంది. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఒకటే బాల్, ఒక్కటే క్షణం, ఒకే ఒక్క షాట్ వంటి...జట్టు్క ఆధారపడిన ప్రతీపరిస్థితిలో కూడా అతను ఆడాడు.
క్లాసెన్ తీసుకున్న ఈ నిర్ణయం కష్టమైనదే, కానీ ఎంతగానో ఆలోచించిన తర్వాత తీసుకున్నది. అతను వివరించినట్టుగా, వ్యక్తిగత పరిస్థితులు ఇందులో కీలక పాత్ర పోషించాయి: “కుటుంబం మాత్రమే. ఈమధ్య ప్రయాణాలు చేయడం మరీ ఎక్కువగా మారింది, ఎట్టి పరిస్థితిలో నేను నా కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వయసు పెరిగిన కొద్దీ, మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటారు, అలాగే మీ బలాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. నేను బాగా పరిపక్వ్వంత సాధించాను, కాబట్టి నా ఆటకు ఎక్కువ అవసరం లేదు. నాకు చూసుకోవాల్సిన కుటుంబం ఉంది, అందుకే ఈ ప్రేరణ సులభం అయ్యింది” అని అతను 1xBetకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
నిజాయితీ గల ఈ అంగీకారం ఒక ఆటగాడి పరిపక్వత, ప్రాధాన్యతలను చూపిస్తుంది. అతను విజయం సాధించినప్పటికీ, ఆట అతనిపై ఆధిపత్యం చూపించకుండా చూసుకున్నాడు. బదులుగా, అతను క్రీడకు అలాగే వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతను ఎంచుకున్నాడు.
IPLలో ఉన్న ఇన్ని సంవత్సరాలలో, సన్ రైజర్స్ హైదరాబాద్ కు క్లాసెన్ అంతర్గత భాగంగా అవతరించాడు. 2024లో SRH ఫైనల్ చేరుకుని, ట్రోఫీకి ఒక్క అడుగు దూరంలో నిలవగా, ఆ విజయంలో హెన్రిజ్ కీలకంగా ఉన్నాడు.
“నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యాను, అందుకే భవిష్యత్తులో మరికొన్ని IPL టోర్నమెంట్లను ఆడగలనని ఆశిస్తున్నాను. IPL ఎంత కష్టంగా మారుతున్నా సరే, అది గొప్ప టోర్నమెంట్. అందుకే ఈ సమయంలో దానిని చాలా ఆస్వాదిస్తున్నాను” అని క్లాసెన్ వెల్లడించాడు.
జట్టులోని యువ ప్రతిభావంతుల కారణంగా తను ఎంతో ప్రేరణ పొందుతాననీ, వారిలో అభిషేక్, నితీష్ చాలా ముఖ్యులని అతను చెప్పాడు. అతని మాటల్లో చెప్పాలంటే, వాళ్లు భవిష్యత్తులో గేమ్ పై ఆధిపత్యం ఖచ్చితంగా సాధిస్తారని అన్నాడు.
రెండు సీజన్ల క్రితం తన కెరీర్ లో అతి ముఖ్యంగా జరిగిన ఒక నిర్దిష్ట సంఘటనను హెన్రిచ్ క్లాసెన్ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో, అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు తిరిగి వచ్చి, బ్యాట్ తో తను బలమైన ప్రదర్శన చూపించి, ఆకట్టుకునే టోర్నమెంట్ అందించాడు. అతను చెప్పిన ప్రకారం, ఆ కాల వ్యవధి చాలా విషయాలను మార్చింది. కేవలం గణాంకాల వరకే కాకుండా, క్రికెట్లో తన పాత్రను అర్థం చేసుకోవడంలో కూడా అది అతనికి సహాయపడింది.
IPL తనను ప్లేయర్ గా, వ్యక్తిగతంగా కూడా చాలా మార్చిందని క్లాసెన్ అంగీకరించారు. “బౌలర్లు బౌలింగ్ చేయటానికి ఇష్టపడని బ్యాటర్ గానే ఉంటూ, కష్టపడి గేమ్‌ను ఆడిన ఆటగాడిగైనప్పటికీ, మైదానంలో మాత్రం మంచి వ్యక్తిగా ఉన్నానని” అన్నాడు. “నా మాదిరిగా బ్రాండ్ క్రికెట్ ను ఆడగలిగే యువకులు నాతో ఉన్నారని ఆశిస్తాను” అని అన్నాడు.” భవిష్యత్తులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు, క్రికెట్లో కోచ్ గానో, లేదా మెంటార్ గానో ఉంటూ తన అనుభవాన్ని కొత్త తరానికి అందించే అవకాశాన్ని హెన్రిచ్ ఎన్నడూ కాదనడు.
ప్రపంచవ్యాప్తంగా యువ ప్లేయర్లకు ఈ క్రీడాకారుడు ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఇప్పటికీ కూడా, తను ఎవరి నుండి నేర్చుకున్నాడో వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. క్లాసెన్ ప్రత్యేకంగా డేవిడ్ మిల్లర్ గురించి ఎక్కువగా మాట్లాడతాడు, ఎందుకంటే గేమ్ పట్ల ఇతని దృక్పథంపై అతను ఎంతగానో ప్రభావం చూపాడు.
ఇప్పుడే కొత్తగా పెద్ద స్థాయిలో క్రికెట్ ఆడడం ప్రారంభించినవారికి, పెద్ద విషయాలను అందుకోవడానికి తొందరపడవద్దని అతను సలహా ఇస్తున్నాడు. ఇదే మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీ నియమాలకు కట్టుబడి ఉండడానికి అత్యంత కీలకమని అతను చెబుతున్నాడు. “ఏ పనిని అతిగా చేయకండి, మీరు ఏంటో తెలుసుకుని, మీ విధానానికి కట్టుబడండి, అప్పుడే మీరు సరైన విధంగా ఉండగలరు” అని హెన్రిచ్ విధానాన్ని వెల్లడించాడు.
తన జీవితంలో ఏదైనా మ్యాచ్ ను తిరిగి ఆడగలిగితే, క్లాసేన్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌ను రెండో ఆలోచన లేకుండా ఎంచుకుంటాడు. అతను, దానిని గుర్తుచేసుకుంటూ.. “తొలి టెస్ట్ మ్యాచ్‌లో , నేను తిరిగి వెనుకకు వెళ్లి, మొదటి షాట్ కంటే మెరుగ్గా ఆడేందుకు ఆశిస్తాను, కానీ జీవితంలో మనం అనుకున్న విధంగా ఉండదు” అని అన్నాడు.
మరోసారి, ఈ విషయం చెప్పడం ఎంతో ముఖ్యం.. క్లాసీన్ తన కెరీర్ ను జాతీయ జట్టుతో మాత్రమే ముగించాడు. క్లబ్ స్థాయిలో, అతని ముందు ఇప్పటికీ ఎన్నో సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే, అతను IPL ఆడడం కొనసాగిస్తాడు, ఇదే విధంగా MLC, ద హండ్రెడ్, SA20 టోర్నమెంట్లను కూడా ఆడతాడు.
అంతర్జాతీయ ఆట నుండి దూరం జరగడం అనేది, అతనికి తన కుటుంబంతో మరింత సమయం గడపడానికి అవకాశం అందిస్తుంది. అలాగే అతనిని అసాధారణమైన ప్లేయర్ గా చేసిన శక్తిని వాళ్లకు కొంత పంచడానికి వీలు కల్పిస్తుంది. 1xBet తాజాగా నిర్వహించిన అభిమానుల పోల్ ప్రకారం, IPLలో అత్యంత ప్రముఖ అథ్లెట్లలో ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు 5వ స్థానంలో నిలిచాడు.
దిశానిర్దేశం చేయగల తన అమోఘమైన ఆట తీరుతో క్లాసెన్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు. “అతను నాకు ఆదర్శనీయుడు, అలాగే అతని షాట్లు అమోఘం! అద్భుతమైన స్ట్రైకింగ్ పవర్ ఉంటుంది" అని ఒక ఔత్సాహికుడు తెలిపాడు. మైదానంలోకి హెన్రిచ్ అడుగుపెట్టిన ప్రతిసారి, తను అత్యుత్తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తాడు, అలాగే అసలైన విజేతగా తన దృక్పథాన్ని చూపుతాడు. జట్టు పట్ల తమ నిబద్ధతలు ఎలా ఉన్నా సరే.. క్లాసీన్ ఒక నిజమైన ఛాంపియన్ అని క్రికెట్ ప్రేమికులు ముక్తకంఠంతో చెబుతారు.
అతనికి ఉన్న సహజమైన ప్రతిభకు, తన అద్భుతమైన శారీరక ధారుడ్యం సహకారం అందిస్తుంది. అందుకే అతను అభిమానుల దృష్టిలో ఎప్పుడూ నిలిచిపోయాడు. “ప్రస్తుతం అతనే అత్యుత్తమ ప్లేయర్ అని విశ్వసించడంతోనే తనపై నేను బెట్ వేసేవాడిని” అని ఒక మద్దతుదారు చెప్పారు.
ఇక మీదట జాతీయ జట్టుకు అతను ఎలాంటి మ్యాచ్ ను ఆడకపోయినా సరే, గణాంకాల వరకు మాత్రమే కాకుండా, క్లాసెన్ ఎన్నో విషయాలను అందించగలిగాడు. స్టేడియంలు, లాకర్ రూమ్ లు, అభిమానుల హృదయాలలో శైలి, స్ఫూర్తి, ఏళ్ల తరబడి తను అందించిన ప్రేరణలు ఉండగా, అవి ఎన్నో ఏళ్ల పాటు నిలిచి ఉండడం ఖాయం.
తనను ఎలా గుర్తుంచుకోవాలని అడిగినప్పుడు క్లాసెన్ ఇచ్చిన సమాధానం ఏంటంటే.. “ఒక మంచి జట్టు సహచరుడిగా, అలాగే అత్యంత నైపుణ్యం ఉన్న క్రికెటర్ గా” అని చెప్పాడు. అదృష్టం కొద్దీ, కేవలం ఇకపై జాతీయ జట్టు కోసం ఆడకపోవడం మినహా, అభిమానులు ఇప్పటికీ తన ఆట ఆనందించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
1xBet అనేది బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బెట్టింగ్ కంపెనీ. బ్రాండ్ కస్టమర్లు సంస్థ వెబ్‌సైట్, యాప్‌తో 70 భాషలలో అందుబాటులో ఉన్న వేలాది క్రీడా కార్యక్రమాలపై పందాలు కాయవచ్చు. 1xBet అధికారిక భాగస్వామి జాబితాలో FC Barcelona, Paris Saint-Germain, LOSC Lille, La Liga, Serie A, European Cricket Network, Durban's Super Giants ఇంకా ఇతర ప్రఖ్యాత క్రీడా బ్రాండ్లు, సంస్థలు ఉన్నాయి. ఇండియాలో ఈ బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రముఖ క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్, నటి ఊర్వశి రౌతేలా ఉన్నారు. ఈ కంపెనీ IGA, SBC, G2E Asia, EGR Nordics అవార్డుల వంటి ప్రతిష్టాత్మక ప్రొఫెషనల్ అవార్డులకు చాలా సార్లు నామినీగా నిలిచి అవార్డులను అందుకుంది.