రిషబ్ పంత్ వరల్డ్ కప్ జట్టులో ఆడితే ఇక అంతే...: సచిన్

By Arun Kumar PFirst Published Jan 17, 2019, 4:02 PM IST
Highlights

 యువ క్రికెటర్ రిషబ్ పంత్ని వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రతిపాదనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. పంత్ మంచి ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసిస్తూనే...ప్రస్తుత జట్టు కూర్పుకు మాత్రం అతడు సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఆస్ట్రేలియాపై సాధించిన టెస్ట్ సెంచరీ ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు యువ క్రికెటర్ రిషబ్ పంత్. దీంతో అతడి ఆటతీరుపై ప్రశంసల వెల్లువ కురిసింది. దీంతో భారత సెలెక్టర్ల దృష్టిని కూడా పంత్ ఆకర్షించాడు. అతడిని వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఇదివరకే తెలిపాడు. అయితే ఈ ప్రతిపాదనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకిస్తున్నాడు. పంత్ మంచి ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసిస్తూనే...ప్రస్తుత జట్టు కూర్పుకు మాత్రం అతడు సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం భారత జట్టుకు ఇద్దరు నాణ్యమైన వికెట్ కీఫర్లు వున్నారని సచిన్ పేర్కొన్నాడు. వారిలో ఒకరు సీనియర్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కాగా ఇంకొకరు దినేశ్ కార్తీక్. సినియారిటీ పరంగా చూసుకున్నా వీరిని వరల్డ్ కప్ జట్టు నుండి పక్కనపెట్టలేము. అంతేకాకుండా గత కొంత కాలంగా బ్యాటింగ్ లో తడబడుతున్న వీరు అడిలైడ్ వన్డేలో మరోసారి పామ్‌లోకి వచ్చారని సచిన్ గుర్తుచేశారు.  

స్పెషలిస్ట్ వికెట్ కీఫర్‌గా కాకుండా పంత్ కి జట్టులో స్థానం కల్పించాలంటే జట్టు నుండి ఎవరో ఒక బౌలర్‌ని కానీ...బ్యాట్ మెన్ ని కానీ తొలగించాల్సి వస్తుంది. ఇలా చెయ్యడం వల్ల భారత జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపుతుందని సచిన్ పేర్కొన్నారు. 

ఇలా ప్రస్తుతం సమతూకంతో వున్న భారత జట్టును కదపడం మంచిది కాదని సచిన్ సూచించారు. అలాకాదని మార్పులు, చేర్పులు చేస్తే జట్టులో ఏదో ఒక విభాగం  దెబ్బతింటుందన్నారు. ఓ ఆటగాడి కోసం జట్టు ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదని సచిన్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

ప్రపంచ కప్: రిషబ్ పంత్ కు ఎమ్మెస్కే శుభవార్త
 

click me!