ప్రపంచ కప్‌ టోర్నీలో భారత జట్టుకు అతడే పెద్ద అండ: సచిన్

Published : Feb 05, 2019, 08:47 PM IST
ప్రపంచ కప్‌ టోర్నీలో భారత జట్టుకు అతడే పెద్ద అండ: సచిన్

సారాంశం

ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ లో టీంఇండియా బౌలింగ్ విభాగానికి జస్ప్రీత్ సింగ్ బుమ్రా నాయకత్వం వహించనున్నాడని లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ జోస్యం చెప్పాడు. స్వతహాగా అత్యుత్తమ బౌలర్ అయిన బుమ్రాకు భారత బౌలింగ్ విభాగాన్ని కూడా ముందుండి నడపించే సత్తా వుందని అన్నాడు. అంతర్జాతీయ జట్లన్నింటిని ఈ మెగా ఈవెంట్ లో బుమ్రా మట్టికరిపిస్తాడన్న నమ్మకం తనకుందని సచిన్ తెలిపాడు.   

ప్రస్తుతమున్న ఇండియన్ టీంలో బుమ్రానే అత్యుత్తమ ఆటగాడు అనడంలో తనకెలాంటి సందేహం లేదని సచిన్ పేర్కొన్నాడు. బుమ్రా ఒకే సారి ఈ స్థాయికి చేరుకోలేదని.. ప్రతి మ్యాచ్ లో తన ఆటతీరును మెరుగుపర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడన్నాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాట్ మెన్స్గా పేరుతెచ్చుకున్న ఆటగాళ్లను కూడా బుమ్రా తన పదునైన బంతులతో ఇబ్బంది పెట్టగలడని సచిన్ పేర్కొన్నాడు. 

గత నాలుగేళ్లుగా బుమ్రాను తాను చాలా దగ్గర నుండి చూస్తున్నానని...అతడు శక్తివంచన లేకుండా నిజాయితీగా కష్టపడతాడని ప్రశంసించాడు. భారత జట్టులో బుమ్రా టాప్ బౌలర్‌గా మారడం తనను ఆశ్చర్యపరచలేదన్నాడు. తాజాగా జరిగిన పలు మ్యాచుల్లో బుమ్రా అత్యుత్తమ ఆటతీరు కనబర్చి ప్రపంచ కప్ జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడని సచిన్ పేర్కొన్నాడు. 

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?