క్రొయేషియా రష్యన్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో రష్యాను ఓడించింది.
క్వార్టర్ ఫైనల్లో అసలు సిసిలు మజాను అందించిన మ్యాచ్‌గా రష్యా- క్రొయేషియా మ్యాచ్‌ను చెప్పుకోవచ్చు.. కనీసం గ్రూప్ దశను కూడా దాటలేదనుకున్న రష్యా.. ఆశ్చర్యకరమైన విజయాలతో ఏకంగా క్వార్టర్స్ వరకు చేరడంతో ఆ దేశ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. క్రొయేషియాను కూడా మట్టికరిపిస్తే కప్ మనదే అనుకున్నారు. కానీ క్రొయేషియా రష్యన్ల ఆశలపై నీళ్లు చల్లింది. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా పెనాల్టీ షూటౌట్లో 4-3 తేడాతో రష్యాను ఓడించింది.
* డేనిస్ చెర్సెవ్ 2018 వరల్డ్‌కప్‌లో నాలుగు గోల్స్ కొట్టాడు.. ఇప్పటి వరకు ఇంగ్లాండ్ స్టార్ స్ట్రైకర్ హ్యారీ కేన్ అత్యధిక గోల్స్‌తో(6) ముందు వరుసలో ఉన్నాడు.
undefined
* రష్యా కొట్టిన 20 గోల్స్‌లో 14 మాత్రమే ఈ వరల్డ్‌కప్‌లో అనుమతించారు.
* ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు హెడ్ గోల్స్ నమోదయ్యాయి. ఇంతకు ముందు 2002 ఫిఫా వరల్డ్‌కప్‌లో జర్మనీ-సౌదీ అరేబియా మధ్య జరిగిన మ్యాచ్‌లో 5 హెడ్ గోల్స్ నమోదయ్యాయి.
* క్రొయేషియా ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 8 గోల్స్ కొట్టింది... బెల్జియం అత్యథికంగా 9 గోల్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
* ఆతిథ్య దేశం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ నుంచి వైదొలగడం 1986 తర్వాత ఇది రెండోసారి. ఇంతకు ముందు మెక్సికో ఇలాగే క్వార్టర్స్‌లో నిష్క్రమించింది.