Rohit Sharma: ప్రపంచ కప్ 2023లో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 160 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టోర్నీలో టీమిండియా వరుసగా 9వ విజయాలు సాధించి ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌లో మెన్ ఇన్ బ్లూ వరుసగా 9 విజయాలు ఎలా సాధించిందో .. ఆ గెలుపు సూత్రమేంటో వెల్లడించాడు.
Rohit Sharma: ప్రపంచకప్ 2023లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచులకు తొమ్మిది మ్యాచులు గెలిచింది. ఈ మహా టోర్నీలో ఓటమి ఎగురని జట్టుగా భారత్ నిలిచి సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఆకాశమే హద్దుగా చెలారేగింది. దీపావళి పండుగ నాడు ఫ్యాన్స్ అసలైన ట్రీట్ ఇచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నెదర్లాండ్ ముంగిట పెట్టింది. కానీ లక్ష్య చేధనలో నెదర్లాండ్స్ తడబడింది. 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆల్ అవుటై... వెనుదిగింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ టీమిండియా సక్సెస్ సీక్రెట్ ను తెలియజేశారు. “ఈ టోర్నమెంట్ ప్రారంభం నుండి మేము ఒక్కో మ్యాచ్ గురించి మాత్రమే ఆలోచిస్తూ అందులో బాగా రాణించాము. ఇది సుదీర్ఘ టోర్నీ అయినందున మేము ఎప్పుడూ ఎక్కువసేపు ఆలోచించాలని అనుకోలేదు. ఒక్కో మ్యాచ్‌పై ఫోకస్ చేశాం. దానిని బాగా ఆడటం మాకు చాలా ముఖ్యం. అందరూ ఇలా చేశారు. అలాగే.. వేర్వేరు వేదికలు, విభిన్న పరిస్థితులకు తగ్గట్లు ఆడాల్సి ఉందనే విషయాన్ని కూడా గ్రహించాం. దానికి తదనుగుణంగా ఆడుతున్నాం. తొమ్మిది మ్యాచ్‌ల్లో తన టీం కనబరిచిన తీరుతో తాను చాలా సంతోషంగా ఉన్నాను అని తెలిపారు.
undefined
రోహిత్ శర్మ ఇంకా మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి జట్టు విజయం కోసం సమష్టిగా రాణించడం మంచి సంకేతం. భారతదేశ పరిస్థితులు తెలిసినప్పటికీ.. మేము వేర్వేరు పరిస్థితులలో వేర్వేరు ప్రత్యర్థి జట్లతో ఆడుతున్నప్పుడు భిన్నమైన సవాలు ఎదురవుతున్నాయి. ఆ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించాం. చక్కగా అందిపుచ్చుకున్నాం. టోర్నీఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లో చేజింగ్ చేసి గెలిచాం. ఆ తరువాత మొదట బ్యాటింగ్ పేసర్లు స్పిన్నర్లతో కలిసి సత్తా చాటారు. అని తెలిపారు.
భారత కెప్టెన్ మాట్లాడుతూ, “డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని చక్కగా ఉంచడానికి ఫలితాలు ముఖ్యమైనవి. భారత్‌లో ఆడుతున్నప్పుడు భారీ అంచనాలు ఉండటం సహజం. వాటిని పక్కనపెట్టి ఆటపై దృష్టి పెడతాం. టోర్నమెంట్ ప్రారంభమైన తర్వాత మేము ఒకరికొకరు ఆనందించాము. మేము మైదానంలో ఉత్సాహంగా, సరదాగా ఆట ఆడాలనుకున్నాము. ఇది మా ప్రదర్శనలో ప్రతిబింబిస్తుంది. బయటి వాతావరణం ఉత్సహంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నాం.. అలా చేయడం వల్ల ఆటగాళ్ళు ఎటువంటి భారం లేకుండా రాణిస్తారు. అని తెలిపారు
బౌలర్ల గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.. జట్టులో ఐదుగురు బౌలర్లు ఉన్నప్పుడు.., ఆరో బౌలర్ కోసం ఎంపిక సమస్య వెంటాడుతోంది. ఈరోజు మాకు 9 మంది బౌలర్లు ఉన్నారు.దీంతో కొన్ని సార్లు ప్రయోగాలు చేస్తున్నాం.. ఈ మ్యాచ్‌లో మా పేసర్లు అవసరం లేని వైడ్ యార్కర్లు బౌలింగ్ చేశారు. మొత్తానికి టీం మొత్తం సమిష్టిగా రాణిస్తోంది 'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.