ICC World cup 2023: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా విజయయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ గెలుపొంది.. ఓటమే ఎగురని జట్టుగా సెమీఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఆదివారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) దుమ్మురేపాడు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటీ?
ICC World cup 2023: వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ దశలో ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజయ సాధించింది. ఈ టోర్నీలో ఓటమంటూ ఎగురని జట్టుగా భారత్ నిలిచి సెమీఫైనల్‌కు అడుగుపెట్టింది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది.
దీపావళి పండుగ నాడు ఫ్యాన్స్ అసలైన ట్రీట్ ఇచ్చింది టీమిండియా. స్కోర్ బోర్డును తారాజువ్వలా పరిగెత్తించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా ఆకాశమే హద్దుగా హల్ చల్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఏకంగా 411 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో నెదర్లాండ్స్ తడబడింది. 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట వెనుదిగింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
undefined
దుమ్మురేపిన కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. అందులో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్(KL Rahul) దుమ్మురేపాడు. రాహుల్ తన హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో విధ్వంసం స్రుష్టించారు. నెదర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ..ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అందివచ్చిన ప్రతి బాల్ ను బౌండరీకి తరలించారు. బౌలర్లను ఉచ్చ కోత కోస్తూ తన పరుగుల దాహం తీర్చుకున్నాడు. కేవలం 62 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 102 పరుగులు చేశాడు.
దీంతో వరల్డ్ కప్ టోర్నీలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును కేఎల్ రాహుల్ (KL Rahul) బద్దలు కొట్టారు. అంతకు ముందు 63 బాల్స్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన భారతీయుడుగా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఆ రికార్డును రాహుల్ బీట్ చేశారు. నేటీ మ్యాచ్ లో 62 బంతుల్లోనే శతకం బాది రోహిత్ రికార్డును అధిగమించాడు. వన్డే ప్రపంచ కప్ లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన జాబితాలో తొలుత కేఎల్ రాహుల్ నిలువగా.. రెండో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నారు.
మూడవ స్థానంలో డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 2007 వరల్డ్ కప్ లో బెర్ముడాతో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ 81 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు. ఆ తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 83 బంతుల్లో సెంచరీతో విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు కొట్టిన రెండో భారత వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు క్రియేట్ చేశారు. 1999 వరల్డ్ కప్‌లో శ్రీలంక మీద రాహుల్ ద్రావిడ్ 145 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నారు.