అందువల్లే ఇంత ఘోరంగా ఓడిపోయాం: రోహిత్

By Arun Kumar PFirst Published Feb 6, 2019, 5:44 PM IST
Highlights

న్యూజిలాండ్ వన్డే సీరిస్‌ను గెలిచిన జోష్‌లో టీ20 సీరిస్ ను ఆరంభించిన టీంఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెల్లింగ్టన్ వేధికగా జరిగిన మొదటి టీ20లో భారత్ 80 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ టీ20 ఓటమికి గల కారణాలను టీంఇండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మీడియాకు వివరించాడు.   

న్యూజిలాండ్ వన్డే సీరిస్‌ను గెలిచిన జోష్‌లో టీ20 సీరిస్ ను ఆరంభించిన టీంఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెల్లింగ్టన్ వేధికగా జరిగిన మొదటి టీ20లో భారత్ 80 పరుగుల తేడాతో పరాజయం పాలయ్యింది. ఈ టీ20 ఓటమికి గల కారణాలను టీంఇండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం మీడియాకు వివరించాడు.  

ఈ మ్యాచ్‌‌పై ఆరంభంలోనే పట్టు కోల్పోయామని రోహిత్ తెలిపారు. మొదట బౌలింగ్, ఫీల్డంగ్ విభాగాల్లో విఫలమై భారీగా పరుగులు సమర్పించుకున్నామని తెలిపాడు. ఆ తర్వాత భారీ లక్ష్య చేధన కోసం బరిలోకి దిగి బ్యాటింగ్ విభాగంలోనూ ఘోరంగా విఫలమయ్యామని అన్నారు. ఇలా ప్రతి విభాగంలో ఘోరంగా విఫలమవడమే ఈ ఓటమికి ప్రధాన కారణమని రోహిత్ పేర్కొన్నాడు. 

220 పరుగుల భారీ పరుగులను చేధించే క్రమంలో ఒకటి, రెండు మంచి భాగస్వామ్యాలు నమోదు చేయాల్సిన అవసరం వుంటుంది. అయితే భారత ఆటగాళ్లు ఒక్క భాగస్వామ్యం కూడా నెలకొల్పలేకపోయారు. ఇలా ఏ దశలోనే న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే దిశగా భారత బ్యాటింగ్ సాగలేదని రోహిత్ వెల్లడించాడు. 

ఈ మ్యాచ్ లో ఏకంగా ఎనిమిది మంది బ్యాట్ మెన్స్ తో బరిలోకి దిగినా ఓటమిఫాలవ్వడం నిరాశకు గురిచేసిందన్నాడు. గతంలో ఇంతకంటే తక్కువ మంది బ్యాట్ మెన్స్ తో బరిలోకి దిగి కూడా భారీ లక్ష్యాలను సులువుగా చేధించినట్లు రోహిత్ గుర్తుచేశాడు. ఈ మ్యాచ్ లో ఓటమికి తమ వైఫల్యాలతో పాటు న్యూజిలాండ్ అత్యుత్తమ ఆటతీరు మరో కారణమని రోహిత్ పేర్కొన్నాడు. 

మూడు టీ20ల సీరిస్ లో భాగంగా 0-1తో వెనుకబడినా మిగతా మ్యాచుల్లో పుంజుకుంటామని రోహిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు.  అక్లాండ్‌లో జరగనున్న రెండో టీ20లో గెలుపు కోసం ఇప్పటినుండే కష్టపడతామన్నారు. మిగతా రెండు టీ20లు గెలిచి సీరిస్ ను కైవసం చేసుకోడానికి ప్రయత్నిస్తామని రోహిత్ వెల్లడించాడు.  

సంబంధిత వార్తలు

వెల్లింగ్టన్ టీ20: చుక్కలు చూపించిన కివీస్ బౌలర్లు, భారత్ ఓటమి

click me!