ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ... 20లలో స్మృతి రికార్డ్..!!

By Siva KodatiFirst Published Feb 6, 2019, 1:02 PM IST
Highlights

టీమిండియా మహిళా క్రికెటర్, స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన మరోసారి రికార్డుల్లోకి ఎక్కారు. న్యూజిలాండ్‌తో వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టీ20లో వేగవంతమైన అర్థసెంచరీని నమోదు చేశారు. న్యూజిలాండ్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 

తొలి టీ20 ఆడుతున్న ఓపెనర్ ప్రియా 4 పరుగులకే వెనుదిరిగింది. ఆ క్రమంలో జెమీమాతో జత కలిసిన మంధాన ఆకాశమే హద్దుగా చెలరేగింది. వచ్చిన బంతిని వచ్చినట్లు బౌండరికీ తరలించింది. ఈ క్రమంలో కేవలం 24 బంతుల్లోనే అర్థసెంచరీని నమోదు చేసింది.

ఇందులో 6 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. తద్వారా ఈ ఘనత సాధించిన 5వ బ్యాట్స్‌మెన్‌గా స్మృతీ రికార్డుల్లోకి ఎక్కింది. రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించి భారత్‌ను గెలుపుదిశగా తీసుకెళ్తున్న మంధాన ఔట్ అవ్వడం ఆ తర్వాతి వరుస బ్యాట్స్‌మెన్లు వెంట వెంటనే పెవిలియన్ చేరడంతో టీమిండియా 24 పరుగుల తేడాతో కివీస్ చేతిలో ఓటమి పాలైంది. 

కుప్పకూలిన టాప్ ఆర్డర్...కివీస్ చేతిలో భారత్ ఓటమి
 
click me!