ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి క్యాన్సర్... ‘‘మళ్లీ వస్తా’’

sivanagaprasad kodati |  
Published : Sep 23, 2018, 06:16 AM IST
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడికి క్యాన్సర్... ‘‘మళ్లీ వస్తా’’

సారాంశం

మరో క్రీడాకారుడు క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డాడు. మలేసియా దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ ఏడాది జులైలో లీ చాంగ్‌కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది.

మరో క్రీడాకారుడు క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడ్డాడు. మలేసియా దిగ్గజ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లీ చాంగ్ వీ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈ ఏడాది జులైలో లీ చాంగ్‌కు శ్వాస సంబంధమైన సమస్య ఏర్పడింది.

దీంతో అతను ఆస్పత్రిలో సంప్రదించగా... పరీక్షించిన వైద్యులు ముక్కు క్యాన్సర్ సోకినట్లు తేల్చారు. ప్రస్తుతం అది మూడో దశలో ఉన్నట్లు కథనాలు వినినిస్తున్నాయి. దీనిపై మలేసియా బ్యాట్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు దతుక్ సెరీ నోర్జా జకారియా స్పందిస్తూ.. ‘‘ లీ చాంగ్ వీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

తైవాన్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. కోలుకుంటున్నాడు.. త్వరలోనే అతడు పూర్తిగా కోలుకుని తిరిగి వస్తాడు అన్నాడు. మరోవపైపు  లీ చాంగ్‌కు క్యాన్సర్ సోకడం పట్ల అతని అభిమానులు దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. తమ అభిమాన ఆటగాడు త్వరగా కోలుకుని తిరిగి బ్యాట్ పట్టుకోవాలని వారు పూజలు నిర్వహిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఒకే ఏడాదిలో మూడు టీ20 సెంచరీలు.. బుడ్డోడా నువ్వు కేక అసలు.. నెక్స్ట్ టీమిండియాకే
IND vs SA : వైజాగ్‌లో దబిడి దిబిడే.. భారత్‌ జట్టులో భారీ మార్పులు.. పిచ్ రిపోర్టు ఇదే