దారుణమైన ట్రోలింగ్.. వారిని క్షమించండి.. షమీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్

By team teluguFirst Published Oct 26, 2021, 4:17 PM IST
Highlights

పాక్‌తో మ్యాచ్‌లో టీమిండియా ఓటమి తర్వాత.. ట్రోలింగ్‌కు గురవుతున్న షమీకి మద్దతుగా కొందరు రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షమీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్ట్స్ చేశారు. 

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup)లో భాగంగా జరిగిన భార‌త్- పాకిస్థాన్ మ్యాచ్‌లో టీమిండియా ఓట‌మి త‌రువాత మహమ్మద్ షమీపై విప‌రీతంగా ట్రోలింగ్ మొద‌లైంది. ఈ మ్యాచ్‌లో 3.5 ఓవర్లు వేసిన షమీ.. 43 పరుగులు ఇచ్చారు. దీంతో షమీపై తీవ్రమైన కామెంట్స్ చేస్తున్న కొందరు.. టీమిండియా ఓటమికి అతడే ప్రధాన కారణమని నిందిస్తున్నారు. అయితే ట్రోలింగ్‌కు గురవుతున్న Mohammad Shami మద్దతుగా కొందరు రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షమీకి మద్దతుగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో పోస్ట్స్ చేశారు. 

షమీపై ట్రోల్స్‌ను వారు ఖండించారు. షమీకి మద్దతుగా ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. వారు ద్వేషంతో నిండి ఉన్నారు.. వారిని క్షమించండి అని పేర్కొన్నారు.
“మహ్మద్ షమీ మేమంతా మీతో ఉన్నాము. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండి ఉన్నారు.. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వరు. వారిని క్షమించండి” అని Rahul Gandhi ట్వీట్‌ చేశారు.

Also read: రాచరికాన్ని వదిలి.. సామాన్యుడిని పెళ్లాడిన యువరాణి.. ఎట్టకేలకు ప్రేమించిన వాడితో..

“ఆదివారం మ్యాచ్‌‌ గురించి మహ్మద్ షమీని సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తున్నారు. ముస్లింలపై ద్వేషం చూపిస్తున్నారు. క్రికెట్‌లో గెలిచినా ఓడినా.. జట్టులో 11 మంది ఆటగాళ్లు ఉంటారు. కానీ ఒక ముస్లిం ఆటగాడిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం దీనిని ఖండించదా?" అని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్టుగా ANI వార్తా సంస్థ పేర్కొంది. 

మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్.. తదితరులు కూడా షమీకి మద్దతుగా నిలిచారు. ‘మేము #TeamIndiaకి మద్దతు ఇచ్చినప్పుడు.. ఇండియా జట్టుకు ప్రాతినిధ్యం వహించే ప్రతి వ్యక్తికి మద్దతు ఇస్తాము. షమీ ఒక నిబద్ధత కలిగిన, ప్రపంచ స్థాయి బౌలర్. నేను షమీకి,  టీమిండియాకు వెన్నుదన్నుగా నిలుస్తాను’ సచిన్ టెండూల్కర్ అని ట్వీట్ చేశారు.

Also read: భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలి.. కానీ ఇది సమయం కాదు.. టీ20లో భారత్‌పై పాక్ విజయం తర్వాత ఇమ్రాన్ ఖాన్

‘మహ్మద్ షమీపై కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. మేము అతనికి అండగా నిలుస్తాము. అతను ఒక ఛాంపియన్. ఇండియా క్యాప్ ధరించే ప్రతి ఒక్కరి హృదయాలలో భారతదేశం ఉంది. అది ఆన్‌లైన్ మూక కంటే చాలా ఎక్కువ. మేము నీతో ఉన్నాం. వచ్చే మ్యాచ్‌లో నీ సత్తా చూపించు’అని వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశారు. 

షమీకి వ్యతిరేకంగా నెటిజన్లు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలను, వాటిలో కొన్ని దారుణమైన నీచమైన వ్యాఖ్యలను తొలగించే చర్యలను త్వరగా ప్రవేశపెట్టినట్లు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది. తమ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు. 

click me!