ఆటగాళ్ల దయనే, నాదేమీ లేదు: ఆసియా కప్ విజయంపై రోహిత్

By pratap reddyFirst Published Sep 29, 2018, 5:08 PM IST
Highlights

టోర్నీ అంతా ఒత్తిడి ఎదుర్కొంటూనే బాగా రాణించారని కొనియాడాడు. ఆసియా కప్ విజయం తమ కష్టానికి తగిన ఫలితమని రోహిత్ చెప్పాడు. బంగ్లాదేశ్ కూడా బాగా రాణించిందని రోహిత్ ప్రశంసించాడు. చివరి బంతి వరకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాడు.

దుబాయ్: సహచర ఆటగాళ్లను ఆసియా కప్ టోర్నీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలతో ముంచెత్తాడు. ఆసియా కప్ ను గెలుచుకోవడం వెనక ఆటగాళ్ల సమిష్టి కృషి ఉందని ఆయన అన్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన తన అభిప్రాయాలను వెల్లడించాడు.

జట్టు సభ్యుల మద్దతు లేకుంటే విజయం సాధించడం కష్టమయ్యేదని అన్నాడు. ఇటువంటి జట్టు ఉన్నప్పుడు కెప్టెన్  పని మరింత సులభం అవుతుందని అన్నాడు. టోర్నీ అంతా ఒత్తిడి ఎదుర్కొంటూనే బాగా రాణించారని కొనియాడాడు. ఆసియా కప్ విజయం తమ కష్టానికి తగిన ఫలితమని రోహిత్ చెప్పాడు
 
బంగ్లాదేశ్ కూడా బాగా రాణించిందని రోహిత్ ప్రశంసించాడు. చివరి బంతి వరకు గట్టి పోటీ ఇచ్చిందని చెప్పాడు. బంగ్లాదేశ్ బౌలర్లు తొలి 10 ఓవర్లలో తమను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టేశారని, మిగతా పదిమంది ఆటగాళ్ల మద్దతు లేకుంటే గెలవడం కష్టమయ్యేదని అన్నాడు. 

తుది పోరులో మిడిల్‌ ఆర్డర్‌దే కీలక పాత్రగా రోహిత్‌  అని చెప్పాడు. తమ జట్టు ఒత్తిడిలో పడ్డ సమయంలో మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాళ్లు ఆకట్టుకుని విజయం ఖాయం చేశారన్నాడు. ఓవరాల్‌గా చూస్తే తమ ఫినిషింగ్‌ లైన్‌ అద్భుతంగా ఉందన్నాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ ఆది నుంచి దూకుడుగా ఆడిందని, బంతి కాస్త పాత బడిన తర్వాత స్పిన్నర్లు రాణించే అవకాశం ఉందని ముందే ఊహించామని అన్నాడు. తాము ఏదైతే అనుకున్నామో.. అదే జరిగిందని, క్రమేపీ బంగ్లాను భారీ స్కోరు చేయకుండా పైచేయి సాధించామని అన్నాడు. 

click me!