ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది.. మోడీతో కలిసి ఐస్‌క్రీమ్ తినడమే: సింధూ విజయంపై ఆమె తండ్రి స్పందన

Siva Kodati |  
Published : Aug 01, 2021, 06:27 PM IST
ఒలింపిక్స్‌లో మెడల్ గెలిచింది.. మోడీతో కలిసి ఐస్‌క్రీమ్ తినడమే: సింధూ విజయంపై ఆమె తండ్రి స్పందన

సారాంశం

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధూ ప్రదర్శనపై ఆమె తండ్రి పీవీ రమణ హర్షం వ్యక్తం చేశారు. చాలా దూకుడుగా అటాకింగ్ గేమ్ ఆడిందని రమణ వెల్లడించారు. ఎల్లుండి తాను ఢిల్లీకి వెళ్లి సింధుకి స్వాగతం పలుకుతానని ఆయన చెప్పారు

కాంస్యం సాధించడం ద్వారా పీవీ సింధు దేశానికి పేరు తీసుకొచ్చిందన్నారు ఆమె తండ్రి పీవీ రమణ. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం జరిగిన పోరులో పీవీ సింధే విజయం సాధించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన.. నిన్నటి ఓటమితో కృంగిపోకుండా వెంటనే ఫామ్‌లోకి రావడం అద్భుతమని రమణ అన్నారు. ఫోకస్‌గా బాడీ లాంగ్వేజ్‌తో పోరాడాలని తాను చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

Also Read:టోక్యో ఒలింపిక్స్: కాంస్యం గెలిచిన పీవీ సింధు... రెండో భారత అథ్లెట్‌గా రికార్డు...

నిన్నటి మ్యాచ్‌లో ఓటమిపై సింధూ, ఆమె కోచ్ విశ్లేషణ చేసుకున్నారని రమణ తెలిపారు. ఎక్కడా తగ్గకుండా అటాకింగ్ చేయాల్సిందిగా తాను చెప్పానని.. సింధూ ఇవాళ చాలా పాజిటివ్‌గా ఆడిందని ఆయన వెల్లడించారు. చాలా దూకుడుగా అటాకింగ్ గేమ్ ఆడిందని రమణ వెల్లడించారు. ఎల్లుండి తాను ఢిల్లీకి వెళ్లి సింధుకి స్వాగతం పలుకుతానని ఆయన చెప్పారు. సింధు తనదైన శైలిలో ఆడేందుకు కోచ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని రమణ పేర్కొన్నారు. మెడల్ తీసుకొచ్చింది కాబట్టే ప్రధానితో కలిసి ఐస్ క్రీమ్‌ తింటుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. 

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది. కాంస్యపతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివో‌తో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు, భారత్‌కి పతకాన్ని అందించింది.

PREV
click me!

Recommended Stories

Sophie Devine : 4, 4, 6, 6, 6, 6 అమ్మబాబోయ్ ఏం కొట్టుడు.. ఒక్క ఓవర్‌లో 32 రన్స్
IND vs NZ : కోహ్లీ, గిల్ విధ్వంసం.. కేఎల్ రాహుల్ మాస్ ఫినిషింగ్