మరింత మెరుగ్గా సన్నద్దమవ్వాల్సింది... రజతం కూడా ఆనందాన్నించ్చింది : సింధు

First Published 31, Aug 2018, 11:46 AM IST
Highlights

ఆసియా క్రీడల్లో సాధించిన రజత పతకం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు భారత్ స్టార్ షట్లర్ పివి.సింధు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియా క్రీడల్లో చాలా బాగా ఆడి రజతం సాధించానన్నారు. అయితే స్వర్ణం కోసం వంద శాతం ప్రయత్నించినా గెలవలేకపోయానన్నారు. తనకు ఫైనల్ ఫోబియా లేదని, ప్రత్యర్థి తైజు తనకంటే బాగా ఆడి విజయం సాధించినట్లు సింధు తెలిపారు.

ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ విభాగంలో పతకాలు సాధించి ఇండియాకు తిరిగివచ్చిన సైనా, సింధు లు గచ్చిబౌలి లోని పుల్లెల గోపిచంద్ అకాడమీలో విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో వీరిద్దరితో పాటు బ్యాడ్మింటన్ కోచ్ పెల్లెల గోపిచంద్ కూడా పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సైనా మాట్లాడుతూ...ఆసియా క్రీడల్లో మొదటిసారి మహిళా బ్యాడ్మంటన్ లో పతకాలు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే తన ఆటతీరును కాస్త మెరుగుపర్చుకోవాల్సి ఉందని అన్నారు. ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించడం పట్ల తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు.

'https://static.asianetnews.com/images/01cp7a2etgmar70cfpkc7c9pec/nehwal__sindhu_s_media_400xNaNxt.jpg' alt="" src="https://static.asianetnews.com/images/01cp7a2etgmar70cfpkc7c9pec/nehwal__sindhu_s_media.jpg" layout='responsive' >

చైనా క్రీడాకారిణి తైజు వంటి ప్రపంచ నెంబర్ వన్ క్రీడాకారిణిని ఓడించడానికి ఖచ్చితమైన వ్యూహాలతో బరిలోకి దిగాల్సి ఉంటుందని కోచ్ గోపిచంద్ అన్నారు. అయితే ఈమెపై సైనా, సింధులు ఆడిన విధానం భాగానే ఉందని, అయితే ఇంకాస్త మెరుగ్గా ఆడివుంటే మంచి ఫలితాలు వచ్చేవన్నారు.
 

Last Updated 9, Sep 2018, 11:25 AM IST