Cricket: మేం అనుకున్నది జరగనప్పటికీ...ఈ ప్రయాణం మాత్రం అద్భుతం..ప్రీతి ఎమోషనల్ పోస్ట్‌!

Published : Jun 07, 2025, 07:11 AM IST
punjab kings ipl 2025

సారాంశం

ఐపీఎల్ 2025లో అద్భుతంగా రాణించిన పంజాబ్ కింగ్స్‌పై ప్రీతి జింటా ఎమోషనల్ పోస్ట్‌ చేసింది. టోర్నీ చివరి వరకు పోరాడిన ఆటగాళ్లపై ఆమె ప్రశంసలు కురిపించింది.

ఈ ఏడాది ఐపీఎల్‌ 2025 సీజన్‌ పంజాబ్ కింగ్స్‌కు (Punjab Kings) నిజంగా ఓ ప్రత్యేక అనుభవంగా మారింది. సీజన్‌ ప్రారంభంలో ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోకపోయినా, ఫలితాల్లో మాత్రం ఈ జట్టు అందరినీ ఆశ్చర్యపరిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరి, ఫైనల్‌ వరకు అదిరిపోయే ప్రదర్శన చూపించింది.

అయితే ఫైనల్‌లో మాత్రం కాస్త తడబడి కప్‌ను కోల్పోయారు. అయినా ఈ ప్రదర్శన జట్టుపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ సహ యజమానిగా ఉన్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా(Preeti Zinta) తన భావోద్వేగాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అన్ని కష్టాల్ని తట్టుకుని

ఆమె జట్టు ఎంతో ధైర్యంగా ఆడిందని, యువ ఆటగాళ్లపై ఎంతో గర్వంగా ఉందని ఆమె తెలిపారు. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయినప్పటికీ, జట్టు అన్ని కష్టాల్ని తట్టుకుని ముందుకు సాగిందని చెప్పారు.

ఈసారి హోం మ్యాచులు ఇతర రాష్ట్రాల్లో జరగడం, టోర్నమెంట్ మధ్యలో విరామాలు రావడం వంటి సమస్యలు ఎదురైనా.. ఆటగాళ్లు తమ ఆటతో అద్భుతంగా రాణించారని ఆమె అభిప్రాయపడ్డారు. చివరి వరకు పోరాడిన టీమ్‌ తమ హృదయాలను గెలుచుకుందన్నారు.

ఈ పోస్ట్‌పై అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. కొందరు ఈ మాటలు చూస్తే కళ్లలో నీళ్లు వస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వచ్చే సీజన్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. మరోవైపు, ఐపీఎల్‌ టైటిల్‌ను తొలిసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అందుకోవడం సీజన్‌ను మరింత ప్రత్యేకంగా మార్చింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

టీమిండియాకి శనిలా దాపురించారు.! అదే జరిగితే మూడో వన్డేలోనూ టీమిండియా ఖేల్ ఖతం
చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే