RCB stampede : ఎవరీ నిఖిల్ సోసలే..? కోహ్లీ, అనుష్కతో ఇతడికి సంబంధమేంటి?

Published : Jun 06, 2025, 04:06 PM IST
Nikhil Sosale

సారాంశం

బెంగళూరులో ఆర్‌సీబీ గెలుపు సంబరాలు విషాదం నింపాయి. భారీ ర్యాలీలో తొక్కిసలాటలో జరిగి 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో మొదటి అరెస్ట్ జరిగింది. నిఖిల్ సోసలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బెంగళూరు: ఐపీఎల్ 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తరువాత జరిపిన సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులో జరిగిన బస్ పేరేడ్ సమయంలో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

ఈ ర్యాలీకి ప్రధానంగా బాధ్యుడిగా గుర్తించిన ఆర్‌సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలేను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయనను ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో DNA మేనేజ్‌మెంట్‌కు చెందిన కిరణ్, సుమంత్, సునిల్ మ్యాథ్యూ అనే ముగ్గురిని కూడా విచారణకు పిలిపించారు.

ఎవరీ నిఖిల్ సోసలే?

లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. 1986లో జన్మించిన నిఖిల్ రెండు సంవత్సరాలుగా ఆర్‌సీబీకి మార్కెటింగ్ హెడ్‌గా పని చేస్తున్నారు. ఇండియాలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) సంస్థలో 13 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ఈ USL సంస్థే ప్రస్తుతం ఆర్‌సీబీకి యాజమాన్యం నిర్వహిస్తోంది. నిఖిల్ వ్యాపార భాగస్వామ్యాల విభాగానికి హెడ్‌గా కూడా పనిచేశారు. ఆయన ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్శిటీలో డబుల్ మేజర్ డిగ్రీ పొందారు.

అనుష్క-కోహ్లీతో లింక్:

ఐపీఎల్ మ్యాచ్‌లలో అనుష్క శర్మతో పాటు నిఖిల్ చాలాసార్లు కనిపించారు. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అనుష్కతో కలిసి ఉన్నారు. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, సాక్షి ధోనీ, చాహల్, దీపికా పల్లికల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి ప్రముఖులు నిఖిల్‌ను సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు.

అరెస్టుకు కారణం:

ఆర్‌సీబీ ఐపీఎల్ గెలుపు తర్వాత బెంగళూరులో బస్సు పేరేడ్‌ను నిర్వహించాలనే పథకాన్ని నిఖిల్ రూపొందించారు. కానీ ఈ ఈవెంట్‌కు ప్రభుత్వ అనుమతి లేకపోయినా సోషల్ మీడియా ద్వారా ప్రకటన చేయడం జరిగింది. ఆర్‌సీబీ అధికార ఖాతాలో ఫ్రీ ఎంట్రీ అని పోస్టు చేయడంతో భారీగా జనాలు తరలివచ్చారు. మేనేజ్‌మెంట్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించడంతో తొక్కిసలాటకు దారి తీసింది.

ప్రస్తుతం నిఖిల్ సోసలేతో పాటు DNA మేనేజ్‌మెంట్‌కు చెందిన మిగతా బాధ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకునే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

టీమిండియాకి శనిలా దాపురించారు.! అదే జరిగితే మూడో వన్డేలోనూ టీమిండియా ఖేల్ ఖతం
చెత్త ఆటతో ఆ ఇద్దరిపై వేటు.. వైజాగ్ వన్డేకి టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే