పుల్వామా ఉగ్రదాడి: వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడొద్దు

By Siva KodatiFirst Published Feb 18, 2019, 1:32 PM IST
Highlights

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల దాడి అంతంత మాత్రంగా ఉన్న భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. 

పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ బలగాలపై ఉగ్రవాదుల దాడి అంతంత మాత్రంగా ఉన్న భారత్-పాక్ క్రికెట్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాడికి నిరసనగా ఇప్పటికే ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ కెప్టెన్, ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలగించింది.

అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి డీస్పోర్ట్స్, ఐఎంజీ-రిలయన్స్ తప్పుకున్నాయి. తాజాగా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను సైతం టీమిండియా బహిష్కరించాలని డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి.

సీసీఐ కార్యదర్శి సురేశ్ బఫ్నా మాట్లాడుతూ... జవాన్లపై దాడి జరిగిన నాటి నుంచి నేటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదని మండిపడ్డారు. ఇమ్రాన్ దీనిపై కనీస స్పందన తెలియజేయాల్సి ఉంది.

మన జవాన్ల మీద జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామన్నారు. క్రికెట్ క్లబ్ ఇఫ్ ఇండియా క్రీడా రంగానికే చెందినదే అయినా.. ముందు తమకు దేశమే ముఖ్యమన్నారు. వాళ్ల దేశం వైపు ఏ తప్పు లేకపోతే ఇమ్రాన్ ఖాన్ ఇంత వరకు ఎందుకు మాట్లాడలేదని సురేశ్ ప్రశ్నించారు.

త్వరలో జరగనున్న ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలని ఆయన బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. 2019 ప్రపంచకప్‌లో భాగంగా జూన్ 16న దాయాదుల మధ్య పోరు జరగాల్సి ఉంది. 

click me!