పాక్‌కు అంబానీ షాక్..పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న రిలయన్స్

Siva Kodati |  
Published : Feb 18, 2019, 12:39 PM IST
పాక్‌కు అంబానీ షాక్..పీఎస్‌ఎల్ నుంచి తప్పుకున్న రిలయన్స్

సారాంశం

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారతీయులు రగిలిపోతున్నారు. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్‌కు ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను ఉపసంహరించుకోవడంతో పాటు ఆ దేశం నుంచి దిగుమతులపై 200 శాతం కస్టమ్స్ డ్యూటీని విధించింది.

ఈ క్రమంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడిపై రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ నుంచి తప్పుకోవాలని ఐఎంజీ రిలయన్స్ సంస్థ నిర్ణయించింది. పీఎస్‌ఎల్‌కు అఫీషయిల్ ప్రొడక్షన్ పార్టనర్‌గా ఉన్న ఐఎంజీ రిలయన్స్ ఇకపై లీగ్‌తో ఎలాంటి భాగస్వామ్యాన్ని కొనసాగించదని సంస్థ తెలిపింది.

తక్షణం నిర్ణయం అమల్లోకి వచ్చినట్లేనని, ఈ విషయాన్ని పాక్ క్రికెట్ బోర్డుకు కూడా తెలిపింది. పీఎస్ఎల్‌తో ఒప్పందం మేరకు ఐఎంజీ రిలయన్స్ పలు మ్యాచ్‌ల లైవ్ కవరేజ్‌కి అవసరమయ్యే వనరులను సమకూర్చాల్సి వుంది.

టీవీ ఛానెళ్లు, కవరేజ్ చేసే వ్యక్తులు, కెమెరాలు, ఓబీ వ్యాన్‌లు ఇతర మౌలిక వసతుల కల్పనకు పీసీబీ-ఐఎంజీ రిలయన్స్ ఒప్పందం చేసుకున్నాయి. మరోవైపు ఇండియాలో పీఎస్ఎల్‌ ప్రత్యక్ష ప్రసారాల నుంచి తప్పుకుంది. ఉగ్రదాడులకు పాల్పడే పాకిస్తాన్ వంటి దేశాలతో వాణిజ్యపరమైన బంధం అవసరం లేదని భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే