400 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ.. ఎలా పంచుతారంటే..?

First Published Jun 9, 2018, 11:08 AM IST
Highlights

400 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ.. ఎలా పంచుతారంటే..?

హైదరాబాద్: వరల్డ్ కప్ టీమ్స్, గేమ్స్, ప్లేయర్స్, షెడ్యూల్, స్టేడియాలు.. ఇంత హంగామా దేనికంటే ట్రోఫీతో పాటు అది తెచ్చిపెట్టే మెగా ప్రైజ్ మనీ కోసమంటారు తలపండిన ఫుల్‌బాల్ ప్లేయర్స్.

2014లో 358 మిలియన్ డాలర్లుగా ఉన్న ప్రైజ్ మనీ కాస్త 400 మిలియన్లకు చేరుకుంది. మరి ఇంతటి మెగా ప్రైజ్ మనీని ఏయే స్టేజ్‌లో టీమ్స్‌ ఎలా దక్కించుకుంటాయో ఒకసారి చూద్దాం..

గ్రూప్ స్టేజ్‌ తర్వాత ఎలిమినేట్ అయ్యే 16 టీమ్స్ చెరి 8 మిలియన్ డాలర్లు పొందుతాయి.
రౌండ్ 16 తర్వాత తప్పుకునే 8 టీమ్స్ చెరి 12 మిలియన్లు దక్కించుకుంటాయి.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఎలిమినేట్ అయ్యే 4 టీమ్స్ చెరి 16 మిలియన్లు పొందుతాయి.
నాల్గవ స్థానానికి పరిమితమైపోయే టీమ్ 22 మిలియన్లు దక్కించుకుంటుంది.
మూడవ స్థానానికి చేరుకున్న టీమ్ 24 మిలియన్లు పొందుతుంది.
రన్నర్-అప్ 28 మిలియన్లు దక్కించుకుంటే ఫైనల్‌గా వరల్డ్ కప్ విన్నర్ ఖాతాలో 38 మిలియన్ డాలర్లు వచ్చిపడతాయి.

వీటికి తోడు వరల్డ్ కప్‌కు క్వాలిఫై అయిన మొత్తం 32 టీమ్స్‌కు ప్రిపరేషన్ ఫీజు కింద చెరి 1.5 మిలియన్ డాలర్లు ముట్టచెబుతారు.
ఫిఫా అమలు చేస్తున్న క్లబ్ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద వరల్డ్ కప్ కోసం ప్లేయర్స్‌ను పంపించే క్లబ్బులకు అదనంగా 209 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తారు.
అంతేకాక వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ప్లేయర్స్ గాయాలకు పరిహారంగా క్లబ్బుల కోసమని క్లబ్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద మరో 134 మిలియన్ డాలర్లు కేటాయిస్తారు.
2018 ఫిఫా వరల్డ్ కప్‌లో పాల్గొనేవారి కోసం ఖర్చు పెట్టే మొత్తం అక్షరాల 791 మిలియన్ డాలర్లు. ఇది గత వరల్డ్ కప్‌తో పోలిస్తే 40 శాతం ఎక్కువ.

click me!