సచిన్ కి దక్కని రికార్డ్ ని సొంతం చేసుకున్న పృథ్వీ షా

By ramya neerukondaFirst Published Oct 4, 2018, 2:19 PM IST
Highlights

ఇండియా తరపున అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన రెండో ఆటగాడుగా పృథ్వీ షా నిలిచాడు. 

ఇప్పుడు ఎవ్వరి నోట విన్నా.. పృథ్వీ షా పేరే వినపడుతోంది. మొదటి టెస్టు మ్యాచ్ లోనే సెంచరీ కొట్టేసి.. రికార్డు సాధించేశాడు.  ఇండియా తరపున అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన రెండో ఆటగాడుగా పృథ్వీ షా నిలిచాడు. ఇదొక్కటే కాదు.. చాలా రికార్డులను ఈ కుర్రాడు సొంతం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కి కూడా దక్కని రికార్డుని పృథ్వీ సొంతం చేసుకున్నాడు.

వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో శతకం సాధించిన పృథ్వీ... రంజీ, దులీప్‌ ట్రోఫీలతో పాటు టెస్టుల్లోనూ అరంగేట్ర మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌.. రంజీ, దులీప్‌ ట్రోఫీల్లో తన తొలి మ్యాచ్‌ల్లోనే శతకం చేసినా.. టెస్టుల్లో మాత్రం శతకానికి 13 మ్యాచ్‌ల వరకు వేచి చూడాల్సి వచ్చింది. మరోవైపు టెస్టుల్లో భారత్‌ తరపున తొలి మ్యాచ్‌లో శతకం సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగానూ పృథ్వీ రికార్డు సృష్టించాడు. 1955లో విజయ్‌ మెహ్రా న్యూజిలాండ్‌పై సెంచరీ చేశాడు. అప్పుడు అతడి వయస్సు 17ఏళ్ల 265 రోజులు మాత్రమే. ప్రస్తుతం పృథ్వీ 18 ఏళ్ల 329 రోజుల వయసులో సెంచరీ సాధించాడు.

2013లో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించిన హారిస్‌ షీల్డ్‌ టోర్నీలో రిజ్వి స్ప్రింగ్‌ఫీల్డ్‌ పాఠశాల తరపున ఆడిన పృథ్వీ షా... సెయింట్‌ ఫ్రాన్సిస్‌ డియాస్సి పాఠశాలతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 546 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. పాఠశాల స్థాయిలో గుర్తింపు పొందిన టోర్నీలో 500 పరుగులు సాధించిన తొలి బాలుడిగా షా రికార్డు సృష్టించాడు.

read more news

59 ఏళ్ల రికార్డు బద్ధలు.. అరంగేట్రంలోనే పృథ్వీషా ఘనత

click me!