40 ఇయర్స్ ఇండస్ట్రీ... ఆసీస్‌పై పెరూ విక్టరీ

Published : Jun 27, 2018, 10:36 AM IST
40 ఇయర్స్ ఇండస్ట్రీ... ఆసీస్‌పై పెరూ విక్టరీ

సారాంశం

40 ఇయర్స్ ఇండస్ట్రీ... ఆసీస్‌పై పెరూ విక్టరీ

హైదరాబాద్: వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో మంగళవారంనాటి గ్రూప్ సిలో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 2-0తో ఆస్ట్రేలియాపై పెరూ ఘన విజయం సాధించింది. వరల్డ్ కప్ హిస్టరీలో పెరూ జట్టు 40 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియాపై తొలిసారిగా 2-0 గోల్స్ తేడాతో గెలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆండ్రె కెర్రిల్లో నిలిచాడు. అయితే  గ్రూప్‌లో రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన కారణంగా ఓడిన ఆసీస్, గెలిచిన పెరూ టీమ్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.


ఫస్టాఫ్‌లో పెరూ మిడ్ ఫీల్డర్ ఆండ్రె కెర్రిల్లో 18వ నిముషంలో తొలి గోల్ చేశాడు. ఆస్ట్రేలియా ప్లేయర్స్‌తో పాటు గోల్ కీపర్‌ను తప్పించి అద్భుతమైన గోల్ చేసి, జట్టుకు 1-0తో తొలి ఆధిక్యతను సంపాదించి పెట్టాడు. ఆ తర్వాత ఆట సాగుతూనే ఉంది కానీ ఫస్టాఫ్‌లో ఇరు జట్లలో ఏ ఒక్కటి ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది.


సెకండాఫ్‌లో పెరూ స్ట్రయికర్ పాలో గుర్రెర్రో 50వ నిముషంలో పెనాల్టీ నుంచి వచ్చిన బాల్‌ను ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ను, గోల్‌కీపర్‌ను తప్పించి మరీ బ్రహ్మాండమైన గోల్ చేశాడు. ఆస్ట్రేలియాపై 2-0 ఆధిక్యతను సొంత జట్టుకు దక్కించాడు. ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో జనంతో స్టేడియం కిటకిటలాడిపోయింది.

PREV
click me!

Recommended Stories

India : షెఫాలీ వర్మ విధ్వంసం.. శ్రీలంక బేజారు! రెండో టీ20 టీమిండియాదే
5 Wickets in 1 Over : W W W W W... ఒకే ఓవర్‌లో 5 వికెట్లు.. అంతర్జాతీయ క్రికెట్ లో కొత్త చరిత్ర