India Pakistan : పాక్ టెన్నిస్ ప్లేయర్ అతి.. ఇండియన్ ప్లేయర్‌కి చేదు అనుభవం

Published : May 28, 2025, 01:33 PM ISTUpdated : May 28, 2025, 01:47 PM IST
sania mirza return to tennis court after pregnancy

సారాంశం

 కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా-ఓషియానియా జూనియర్ డేవిస్ కప్ లో భారత టెన్నిస్ ప్లేయర్స్ ను పాక్ ఆటగాళ్లు అవమానించారు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేకపోయిన పాక్ ఆటగాళ్లు ఏం చేసారంటే… 

india Pakistan :  కజకిస్థాన్ లో జరుగుతున్న జూనియర్ డేవిస్ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ను ఇండియా ఓడించింది. ఇండియా చేతిలో ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయిన పాక్ టెన్నిస్ ప్లేయర్ క్రీడాస్పూర్తిని మరిచాడు. ఇండియన్ ప్లేయర్‌పై కోపాన్ని ప్రదర్శిస్తూ దురుసుగా వ్యవహరించాడు. మ్యాచ్ అయ్యాక షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళిన ఇండియన్ ప్లేయర్‌ను పాక్ ప్లేయర్ అవమానించాడు. ఈ ఘటన కజకిస్తాన్‌లో ఆసియా-ఓషియానియా జూనియర్ డేవిస్ కప్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో జరిగింది.

ఈ డేవిస్ కప్ టోర్నీలో ఇండియన్ ప్లేయర్స్ ప్రకాష్ సారన్, తవిష్ పాహ్వా సింగిల్స్‌లో పాక్ ప్రత్యర్థులను ఓడించారు. మ్యాచ్ అయ్యాక ఇండియన్ ప్లేయర్ క్రీడాస్పూర్తిని ప్రదర్శిస్తూ కరచాలనం చేయడానికి వెళ్లగా పాక్ ప్లేయర్స్ అవమానకరంగా వ్యవహరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

9 నుండి 12వ స్థానాల కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 1-2 తేడాతో ఓడినతర్వాత ఇండియా పాకిస్తాన్‌తో తలపడింది.మ పాక్ తో జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌లను ఇండియా గెలిచింది. 

 ఇండియా-పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్లేయర్ ప్రవర్తనపై అభిమానులు మండిపడ్డారు. ఇండియన్ ప్లేయర్ సహనం చూసి అభినందించారు. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup 2026: ఐసీసీకి అంబానీ జియో హాట్‌స్టార్ షాక్
SMAT 2025 : 10 ఫోర్లు, 9 సిక్సర్లతో సునామీ.. డెబ్యూట్‌లో 114 పరుగులతో సంచలనం