కాశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

By Arun Kumar PFirst Published Nov 14, 2018, 4:52 PM IST
Highlights

భారత్-పాకిస్థాన్ ల మధ్య వివాదాస్పద భూభాగమైన కాశ్మీర్ పై మరోసారి పాకిస్థానీ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ఇలాగే కాశ్మీర్ ప్రజలపై భారత్ అనచివేతకు పాల్పడుతోందంటూ  వివాదాస్పదంగా మాట్లాడిన అఫ్రిది భారతీయుల ఆగ్రహానికి  గురైన విషయం తెలిసిందే. అయితే తాజాగా అటు పాకిస్థానీయులకు ఇటు భారతీయులకు ఆగ్రహం కల్గించేలా మాట్లాడి మరోసారి వివాదానికి తెరతీశాడు. 
 
రెండు దేశాల మధ్య వివాదానికి కారణమైన కాశ్మీర్ ను ఓ దేశంగా ప్రకటించాలని అఫ్రిది సూచించాడు.కాశ్మీర్‌ను పాకిస్థాన్‌లో కలపాలన్న డిమాండ్‌ను కూడా అఫ్రిది వ్యతిరేకించాడు. కేవలం నాలుగు ప్రావిన్స్ లను పాలించడానికే పాకిస్థాన్ కు శక్తి లేదని అన్నారు.అందువల్ల కాశ్మీర్ ను పాకిస్థాన్ లో కలపరాదు...అలాగని ఇండియాకు అప్పగించరాదని పేర్కొన్నాడు. అక్కడి  ప్రజల అభీష్టం మేరకు ప్రత్యేక దేశంగా  ఏర్పాటుచేయాలని అఫ్రిది సూచించారు. 

ఇంగ్లాండ్ లో పర్యటనలో వున్న అఫ్రిది అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక కశ్మీర్ కోసం అక్కడి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వారి డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా నిర్ణయం తీసుకోవాలని అఫ్రిది సూచించారు. ఈ వ్యఖ్యలపై పాకిస్థాన్ తో పాటు భారత్ లోనే తీవ్ర చర్చ జరుగుతోంది.   

click me!
Last Updated Nov 14, 2018, 5:00 PM IST
click me!