భారత్-పాక్ మ్యాచ్: పాక్ జట్టే ఫేవరేట్ అన్న భారత మాజీ క్రికెటర్

By Arun Kumar PFirst Published Sep 19, 2018, 12:10 PM IST
Highlights

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న భారత్-పాక్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ  గ్రూప్ మ్యాచ్‌లో దాయాదుల మధ్య పోరు జరగనుంది.

యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న భారత్-పాక్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్‌లో భాగంగా ఇవాళ  గ్రూప్ మ్యాచ్‌లో దాయాదుల మధ్య పోరు జరగనుంది. ఛాంపియన్స్  ట్రోఫీలో పాక్ చేతిలో ఘోర పరాజయానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా కసిగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో పాక్ జట్టే హాట్ ఫేవరేట్ అన్నాడు భారత మాజీ క్రికెటర్.. ఆసియా కప్‌లో టీమిండియా ప్రధాన పోటీదారుగా ఉన్నా.. టైటిల్ మాత్రం పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.

యూఏఈలోని మైదానాల్లో పాక్ తరచుగా ఆడుతుండటంతో పాటు అనూహ్యంగా పుంజుకునే జట్లలో పాక్ ఒకటన్నాడు.. విరాట్ లేకపోవడంతో భారత్ బాగా బలహీనంగా కనిపిస్తుందన్నాడు. మరోవైపు విరాట్ లేకపోయినా టీమిండియా బలమైన జట్టేనన్నాడు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని.... ఆసియా కప్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ ఫుల్ టీమ్ భారత్ అని గంగూలి అన్నాడు.
 

click me!
Last Updated Sep 19, 2018, 12:10 PM IST
click me!