ఆసియా కప్: భారత్ ను వణికించి ఓడిన హాంగ్ కాంగ్

By pratap reddyFirst Published Sep 18, 2018, 5:07 PM IST
Highlights

ఆసియా కప్ లో భాగంగా మంగళవారం జరుగుతున్న మ్యాచులో హాంగ్ కాంగ్ ఇండియాపై టాస్ గెలిచింది. హాంగ్ కాంగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. 

దుబాయ్: భారత్ నిర్దేశించి భారీ లక్ష్యాన్ని ఛేదించేక్రమంలో హాంగ్ కాంగ్ తెగువ ప్రదర్శించింది. భారత్ ను ఒక దశలో వణికించిందనే చెప్పాలి. భారత్ పై కేవలం 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. హాంకాంగ్‌ ఓపెనర్లు నిజాకత్, అన్షుమన్‌లిద్దరు భారత బౌలింగ్‌ను ఆడుకున్నారు. మ్యాచ్‌ను లాగేసుకున్నంత పనిచేశారు. 

చివరకు ఖలీల్‌ అహ్మద్‌ పేస్, కుల్దీప్, చహల్‌ల మణికట్టు మాయాజాలం భారత్ పరువును కాపాడాయి.  మంగళవారం టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 

 హాంకాంగ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేసి ఓడింది. నిజాకత్‌ ఖాన్‌ (115 బంతుల్లో 92; 12 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ అన్షుమన్‌ రత్‌ (97 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్‌) భారత్ పై వీరోచిత పోరాటం చేశారు. భారత బౌలర్లలో  ఖలీల్‌ అహ్మద్, చహల్‌ మూడేసి వికెట్లు తీయగా, కుల్దీప్‌కు 2 వికెట్లు దక్కాయి.  

ఆసియా కప్ లో భాగంగా హాంకాంగ్ తో జరిగిన మ్యాచ్ లో టీంఇండియా 285 పరుగులు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన భారత జట్టు హాకంకాంగ్ ముందు 286 పరుగుల లక్ష్యాన్ని వుంచింది. అయితే డెత్ ఓవర్లలో టీంఇండియా మరోసారి పేలవ బ్యాటింగ్ ను కనబర్చింది. చివరి పది ఓవర్లలో హాకాంగ్ భౌలర్లు కేవలం 48 పరుగులు మాత్రమే సమర్పించి భారత బ్యాట్ మెన్స్ ని కట్టడి చేయడంలో సఫలమయ్యారు.

భారత బ్యాట్ మెన్స్ స్కోరు వివరాలు:

శిఖర్ ధావన్ 127 పరుగులు ( 105 బంతుల్లో)

అంబటి రాయుడు 60 పరుగులు ( 70 బంతుల్లో)

రోహిత్‌ శర్మ  23 పరుగులు ( 22 బంతుల్లో)

దినేశ్ కార్తిక్ 33 పరుగులు ( 38 బంతుల్లో)

ఎంఎస్ ధోనీ డకౌట్ (3 బంతులాడి)

కేదార్ జాదవ్ 28 పరుగులతో నాటౌట్ ( 27 బంతుల్లో)

భువనేశ్వర్ కుమార్ 9 పరుగులు (18 బంతుల్లో)

శార్దూల్ టాకూర్ డకౌట్ (3 బంతులాడి)

కుల్దీప్ యాదవ్ నాటౌట్
 

ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో కదం తొక్కారు. ఆసియా కప్ లో భాగంగా మంగళవారం హాంగ్ కాంగ్ పై జరిగిన మ్యాచులో భారత్ 45 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రోహిత్ శర్మ 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు.

ఆసియా కప్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచులో హాంగ్ కాంగ్ ఇండియాపై టాస్ గెలిచింది. హాంగ్ కాంగ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్ కు దిగింది. 

ఇటీవల పాకిస్తాన్ పై హాంగ్ కాంగ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడంతో రోహిత్ శర్మ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఖలీల్ అహ్మద్ ఆరంగేట్రానికి ఎదురు చూస్తున్నాడు. రెండేళ్ల తర్వాత అంబటి రాయుడు తిరిగి జట్టులోకి వచ్చాడు. 

ఈ మ్యాచు ఫలితం ఎలా ఉన్నా భారత్ మరో 24 గంటల్లో బుధవారం పాకిస్తాన్ ను ఢీకొనబోతోంది. 

click me!