కోహ్లీ లేకపోతే మజా ఉండదు..భారత్ ఓటమి ఖాయం: పాక్ క్రికెటర్

By sivanagaprasad KodatiFirst Published Sep 7, 2018, 12:52 PM IST
Highlights

త్వరలో జరగునున్న ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం భారత అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ జాబితాలో పాక్ అభిమానులు కూడా ఉన్నారు. 

త్వరలో జరగునున్న ఆసియాకప్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం భారత అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఈ జాబితాలో పాక్ అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ లేకపోవడం తమను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందని పాక్ క్రికెటర్ హసన్ అలీ స్వయంగా తెలిపాడు.

ఏ బౌలరైనా ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను అరెస్ట్ చేయాలని ఆరాటపడటం సహజమని.. తాను కూడా కోహ్లీ వికెట్ తీసి సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నాని పేర్కొన్నాడు. అతని వికెట్ తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాక్ అభిమానులు ఎంతో సంతోషపడేవారని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ లేకపోవడం తమకు కలిసొస్తుందని... విరాట్ లేని భారత్‌ టోర్నీలో నిలబడటం కష్టమేనని.. పాక్ చేతిలో భారత్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పాడు. అబుదాబి, దుబాయ్‌లలోని వాతావరణం, మైదానాలు తమ దేశాన్ని తలపిస్తాయని.. చాలా సిరీస్‌లు ఇక్కడ ఆడటం వల్ల ఆసియాకప్ ఫేవరేట్ హసన్ అలీ తెలిపాడు. ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియాకప్‌ ప్రారంభం కానుంది. 

click me!