కుక్ డ్రీమ్ టీమ్‌.. సచిన్, ద్రవిడ్‌‌ దిగ్గజాలు కారా..?

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 11:11 AM IST
Highlights

భారత్‌తో ఐదో టెస్ట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్. ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు

భారత్‌తో ఐదో టెస్ట్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతున్నాడు ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ అలిస్టర్ కుక్. ఈ నేపథ్యంలో 11 మందితో కూడిన తన ఆల్‌టైమ్ డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు.

దిగ్గజాలకు తన టీమ్‌లో స్థానం కల్పించిన కుక్... కెప్టెన్‌గా ఇంగ్లండ్ మాజీ సారథి గ్రాహం గూచ్‌ను ఎంచుకున్నాడు. ఓపెనర్స్‌గా గూచ్.. ఆసీస్ స్టార్ మాథ్యూ హేడెన్ ఆడుతారు. మిడిలార్డర్‌లో లారా, పాంటింగ్, డివిలియర్స్, కలిస్ వారికి ఇష్టమైన స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగుతారు. వికెట్ కీపర్‌గా సంగక్కర.. పేసర్లుగా అండర్సన్, మెక్‌గ్రాత్.. స్పిన్నర్లుగా మురళీధరన్, షేన్‌వార్న్‌లకు చోటు కల్పించాడు.

అయితే ఇతని డ్రీమ్ టీమ్ ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. అతని తరంలో దిగ్గజాలు అనదగ్గ వారందరినీ ఎంపిక కేసిన కుక్‌కు భారత్ నుంచి ఎవరు కనిపించలేదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, గంగూలి, సెహ్వాగ్‌, కుంబ్లే‌లు దిగ్గజాలుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. 

click me!