Pakistan cricket team Rizwan అంతా వాళ్లే చేశారు.. పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ ఏడుపు!

Published : Feb 28, 2025, 09:31 AM IST
Pakistan cricket team Rizwan అంతా వాళ్లే చేశారు.. పాకిస్థాన్  కెప్టెన్ రిజ్వాన్ ఏడుపు!

సారాంశం

పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగాక.. విమర్శలు అధికమయ్యాయి. జట్టు నాయకుడు రిజ్వాన్ దానిపై స్పందించాడు.

పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి నిష్క్రమించిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ "నిరాశ" వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో, పాకిస్తాన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను గ్రూప్ ఎలో అట్టడుగు స్థానంలో ముగించింది. 

న్యూజిలాండ్, భారత్‌తో వరుసగా ఓడిపోయి సెమీఫైనల్ రేసు నుంచి ముందే నిష్క్రమించిన తర్వాత, మహ్మద్ రిజ్వాన్ నేతృత్వంలోని జట్టు గ్రూప్ ఎలో కేవలం ఒక పాయింట్‌తో టోర్నమెంట్‌ను ముగించింది.
దీనిపై మాట్లాడుతూ.. శామ్ అయూబ్, ఫఖర్ జమాన్ గాయాల కారణంగా జట్టు సమతుల్యత దెబ్బతిన్నదని కెప్టెన్ అంగీకరించాడు.

ఐసీసీతో రిజ్వాన్ మాట్లాడుతూ, "మేము బాగా ఆడాలని అనుకున్నాం. మాపై  అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ బాగా ఆడలేదు, ఇది మాకు నిరాశ కలిగించింది" అన్నాడు. శామ్ అయూబ్ గాయం గురించి మాట్లాడుతూ, "గత కొన్ని నెలలుగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో బాగా ఆడుతున్న ఆటగాడు...  తను అకస్మాత్తుగా గాయపడితే, జట్టు ఇబ్బందుల్లో పడేసింది. కానీ ఇలా సాకులు చెబితే మాకూ తెలుసు. ఫఖర్ జమాన్ సైతం అందుబాటుల్ లేడు. ఏదేమైనా ఈ తప్పుల నుంచి నేర్చుకుంటాం" అన్నాడు.

గత ఏడాది ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో పాకిస్తాన్ వన్డే సిరీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన అయూబ్ ప్రోటీస్ టెస్ట్ సిరీస్ సందర్భంగా చీలమండలం గాయంతో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాడు. మరోవైపు, జమాన్ టోర్నమెంట్ ప్రారంభంలో పాకిస్తాన్ జట్టులో భాగం, కానీ న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో కండరాలు పట్టేయడంతో అతన్ని తప్పించారు. పాకిస్తాన్ తదుపరి పర్యటన మార్చి 16 నుంచి ప్రారంభమవుతుంది.  ఐదు మ్యాచ్‌ల టీ20ఐ, మూడు వన్డే సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌లో వెళ్లనుంది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. తొలి టీ20లో సౌతాఫ్రికా చిత్తు
ఒరేయ్ అజామూ.! భారత్‌లో కాదు.. పాకిస్తాన్‌లోనూ కాటేరమ్మ కొడుకు క్రేజ్ చూస్తే మతిపోతోంది