నేను ఎందుకు డ్యాన్స్ చేశానో నా కూతురికి అర్థం కాలేదు.. భర్త విజయంపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్....

By SumaBala BukkaFirst Published Oct 24, 2022, 7:30 AM IST
Highlights

పాకిస్తాన్ పై భారత్ విజయం క్రికెట్ అభిమానులందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ కూడా తన ఆనందాన్ని ఇన్ స్టా వేదికగా పంచుకుంది. 

పాకిస్తాన్ పై అపూర్వమైన ఇన్నింగ్స్ తో భారత్ ను విజయతీరాలకు చేర్చిన విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ‘కింగ్ మళ్లీ వచ్చాడు..  ఛేజింగ్ రరాజు ..’  అంటూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మ కూడా తన భర్తపై ప్రేమను వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ప్రత్యేకంగా విరాట్ గురించి రాసుకొచ్చింది.

‘నువ్వు ఒక అద్భుతం. దీపావళి కంటే ముందే ఇవాళ చాలామంది అభిమానుల్లో సంతోషం నింపావు. నీ కఠినమైన సాధన, సంకల్పం, నమ్మకం, సడలని దృఢ చిత్తం సూపర్.  నా జీవితంలో చూసిన ఉత్తమ మ్యాచుల్లో ఇదొకటి.  మ్యాచ్ ముగిశాక నేను ఆనందంతో డ్యాన్స్ చేశాను. నేను అలా ఎందుకు చేస్తున్నానో నా కూతురికి అర్థం కాక గదంతా కలయతిరిగింది. తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు అని ఏదో ఒక రోజు తప్పకుండా తెలుసుకుంటుంది.

 క్లిష్ట దశను దాటి మునుపెన్నడూ లేనంత బలంగా నా భర్త తిరిగి వచ్చినందుకు నాకెంతో గర్వంగా ఉంది.. అపరిమితమైన ప్రేమతో అని అనుష్క శర్మ పోస్ట్ చేసింది. ‘థ్యాంక్యూ మై లవ్.. ప్రతి విషయంలో నాకు మద్దతుగా నిలిచావు. గొప్పగా భావించా. లవ్ యూ సో మచ్’.. అంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా విరాట్ కోహ్లీ ప్రతిస్పందించారు.

 

click me!