'అతడు ఆడలేడు...' మరో సారి పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగిన కెఎల్ రాహుల్ .. నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్

Published : Oct 24, 2022, 02:53 AM IST
'అతడు ఆడలేడు...' మరో సారి పేలవమైన ప్రదర్శనతో వెనుదిరిగిన కెఎల్ రాహుల్ .. నెట్టింట్లో దారుణమైన ట్రోలింగ్

సారాంశం

భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ కెఎల్ రాహుల్ మరో పేలవమైన ఆట తీరుతో విఫలమయ్యాడు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ వేదికగా భారత్ ,పాకిస్తాన్ మధ్య జరిగిన  టీ 20 ప్రపంచ కప్ 2022 మ్యాచ్‌లో  అతడు 8 బంతుల్లో కేవలం 4 పరుగులు చేసి  ఔట్ అయ్యాడు. ఈ ప్రదర్శన తర్వాత భారత ఓపెనర్  నెట్టింట్లో దారుణంగా  ట్రోల్ చేయబడుతున్నారు.   

టీ 20 ప్రపంచ కప్ 2022 భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. జట్టు విజయంలో రన్ మెషిన్ విరాట్ కోహ్లి కీలక పాత్ర పోషించారు. కానీ..భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్  కేఎల్ రాహుల్ పేలవమైన ప్రదర్శనపై నెట్టింట్లో విమర్శల వర్షం కురుస్తోంది. పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది.

ఈ మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పరుగులు ఛేదించేందుకు బ్యాటింగ్‌కు వచ్చిన టీమిండియా కేఎల్ రాహుల్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. పాక్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా మరోసారి భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్  కేఎల్ రాహుల్‌ను బలిపశువును చేశాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్‌పై భారత ఓపెనింగ్ బ్యాట్స్ మెన్  KL రాహుల్ మరో తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో పీడ కలగా మారింది. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో రాహుల్ 8 బంతుల్లో కేవలం 4 పరుగులే చేశారు. నసీమ్ షా వేసిన అద్భుతమైన బంతితో క్లీన్‌  బోల్డ్ అయ్యాడు. 

అదే తప్పు పునరావృతం  

ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మరోసారి తన పాత తప్పును పునరావృతం చేస్తూ ఇన్‌సైడ్ ఎగ్డే ద్వారా వికెట్ కోల్పోయాడు. ఇంతకుముందు ఆసియా కప్ 2022లో కూడా KL రాహుల్ నసీమ్ షా చేతిలో అవుట్ అయ్యాడు. ఈ రోజు మరోసారి నసీమ్ రాహుల్‌కి పెవిలియన్‌కు దారి చూపించాడు. చాలా కాలంగా..KL రాహుల్ నిరంతరం అదే విధంగా ఔట్ అవుతున్నారు.

ఇంతకుముందు 2021 టీ20 ప్రపంచకప్‌లో షాహీన్ అఫ్రిది కూడా ఇదే విధంగా కేఎల్ రాహుల్‌ను బలిపశువుగా మార్చడం గమనార్హం. ఇప్పుడు రాహుల్ తనలోని ఈ బలహీనతను ఎందుకు అధిగమించలేకపోతున్నాడనే ప్రశ్న తలెత్తింది. రాహుల్ సమస్య టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. కేఎల్ రాహుల్ తరచుగా పెద్ద మ్యాచ్‌లలో ఫ్లాప్‌ అవుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ ఆటతీరుపై జట్టు ఓ కన్నేసి ఉంచుతుంది, ఒకవేళ అతను తదుపరి మ్యాచ్ ల్లో  రాణించలేకపోతే అతడిని జట్టులో కొనసాగించడం కష్టమే.

సోషల్ మీడియాలో రచ్చ

పేలవమైన ఆట తీరు కారణంగా KL రాహుల్  మరోసారి సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ అయ్యాడు. విరాట్‌, హార్దిక్‌లు ప్రతిసారీ టీమ్‌ఇండియాను కష్టాల నుంచి గట్టెక్కిస్తుండగా..రాహుల్ మాత్రం జట్టును ట్రాప్ చేసే పనిని చాలా బాగా చేస్తున్నాడు.KL రాహుల్ పేలవమైన ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియా స్పందన..

ప్రతి పెద్ద టోర్నీకి ముందు కేఎల్ రాహుల్ పై  భిన్నమైన అంచనాలు ఉన్నాయి. విభిన్న క్రికెట్ పదాలను ఉపయోగించి రాహుల్‌ను ప్రశంసించడంలో వెటరన్ క్రికెటర్లు విసిగిపోరు. కానీ ఇది ఎల్లప్పుడూ విరుద్ధంగా ఉంటుంది. తన నుంచి ఉత్తమ ప్రదర్శన  ఆశించిన ప్రతి మ్యాచ్‌లోనూ రాహుల్ విఫలమవుతున్నాడు.ఈరోజు కూడా పాకిస్థాన్‌పై ఈ బ్యాట్స్‌మెన్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి టీమ్ ఇండియా చిక్కుల్లో పడినట్లే కనిపించడంతో మళ్లీ మిడిల్ ఆర్డర్ పై పూర్తి ఒత్తిడి నెలకొంది. అయితే విరాట్ కోహ్లి అద్భుతమైన ఆట తీరుతో టీం ఇండియా ఈ మ్యాచ్‌ని తన ఖాతాలో వేసుకుంది.

టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ 12లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. విరాట్ కోహ్లి 53 బంతుల్లో 82 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడి భారత్ కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఈ విజయం భారతదేశానికి చారిత్రాత్మకమైనది.మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా కోహ్లీని ఎత్తుకుని పిచ్‌పై తిప్పాడు.

చివరి 5 ఓవర్లలో భారత జట్టుకు 60 పరుగులు కావాలి. క్రీజులో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ ఉన్నారు.  టీమిండియా 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ లు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి..  భారత్‌కు చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని అందించారు.

PREV
click me!

Recommended Stories

Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు