Tokyo Olympics : గోల్డ్ చేజారింది.. ఏడుస్తూ పతకాన్ని జేబులో పెట్టుకున్న.. రజతవిజేత బెన్ లైట్

Published : Aug 06, 2021, 10:25 AM IST
Tokyo Olympics : గోల్డ్ చేజారింది.. ఏడుస్తూ పతకాన్ని జేబులో పెట్టుకున్న.. రజతవిజేత బెన్ లైట్

సారాంశం

బెన్ లైట్-హేవీ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగాడు. అయితు, పసిడి కోసం జరిగిన తుదిపోరులో అపజయం ఎదుర్కొన్నాడు. దీంతో అతడు రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్థితి అతడిలో తీవ్ర నిరాశకు దారితీసింది. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన రజతం అతడిలో సంతోషాన్ని నింపలేకపోయింది. దీంతో, రజత పతకాన్ని మెడలో వేసుకునేందుకు నిరాకరించాడు.   

విశ్వ క్రీడల్లో పాల్గొనడమే ఓ అదృష్టం.. ఇక బంగారు పతకం గెలవడం అంటే కీర్తిప్రతిష్టల శిఖరాగ్రానికి చేరుకున్నట్లే.. అందుకే ఎందరో క్రీడాకారులు విశ్వక్రీడల్లో పసిడి పతకం కోసం అహోరాత్రాలు శ్రమిస్తారు. వ్యక్తిగత జీవితాల్ని త్యాగం చేస్తూ ఆటకే అంకితమైపోతారు. మరి ఇంతటి విశ్వప్రయత్నం చేసి.. ఫైనల్స్ కు చేరి.. చివర్లో బంగారు పతకం చేజార్చుకుంటే.. ఇక ఆ క్రీడాకారుడి వ్యథ వర్ణనాతీతం. సరిగ్గా అటువంటి పరిస్తితినే ఎదుర్కున్నాడు బ్రిటన్ కు చెందిన బాక్సర్ బెన్ విట్టేకర్ (24).

బెన్ లైట్-హేవీ వెయిట్ కేటగిరీలో బరిలోకి దిగాడు. అయితు, పసిడి కోసం జరిగిన తుదిపోరులో అపజయం ఎదుర్కొన్నాడు. దీంతో అతడు రజతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ స్థితి అతడిలో తీవ్ర నిరాశకు దారితీసింది. తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన రజతం అతడిలో సంతోషాన్ని నింపలేకపోయింది. దీంతో, రజత పతకాన్ని మెడలో వేసుకునేందుకు నిరాకరించాడు. 

పసిడి పతకాన్ని కోల్పోయిన బాధలో అతడు కన్నీరు మున్నీరవుతూ తన పతకాన్ని జేబులోనే పెట్టేసుకున్నాడు. ‘ఆటలో పాల్గొనేదే పసిడి పతకం కోసం. రజతం కోసం కాదు. ఫైనల్స్ లో  ఓటమి అంటే పసిడి పతకాన్ని కోల్పోవడం. రజతం సాధించడం కాదు. నేను చాలా నిరాశ చెందా. విఫలమైనట్టు భావిస్తున్నా’ అని అతడు కామెంట్ చేశాడు. 

మెడల్ నూ చెతిలో పట్టుకుని ఫొటోలకు ఫోజిచ్చాడు. అయితే.. రెట్టించిన ఉత్సాహంతో తాను మరో పర్యాయం రంగంలోకి దిగుతానని, అనుకున్నది సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు బెన్. 

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !