
టోక్యో ఒలంపిక్స్ లో.. భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఈ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది. ప్లే ఆఫ్ మ్యాచ్ లో జర్మనీని 5-4 తేడాతో ఓడించింది. దీంతో.. కాంస్యం వారి వశమైంది. వారి విజయం పట్ల భారతీయులంతా ఆనందం వ్యక్తం చేశారు. మన్ ప్రీత్ సేనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
దాదాపు 41ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో ఈ పతకం గెలవడం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. అయితే.. ఆ పతకాన్ని అందుకునే సమయంలో అథ్లెట్స్ ఎమోషనల్ అయ్యారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్ల తమ శ్రమకు తగిన ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు.
కాగా.. వారంతా పతకాలు అందుకుంటున్న వీడియో.. వారు ఎమోషనల్ అవుతున్న చిత్రాలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ వీడియోలు యూట్యూబ్ లో లక్షల వ్యూస్ రావడం విశేషం. వారి విజయానికి అందరూ దాసోహమైపోతున్నారు. ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో పై మీరు కూడా లుక్కేయండి..!