బుల్లి అభిమానికి బహుమతిగా... వింబుల్డన్ ఫైనల్ గెలిచిన అనంతరం నోవాక్ జోకోవిచ్...

Published : Jul 12, 2021, 04:05 PM IST
బుల్లి అభిమానికి బహుమతిగా... వింబుల్డన్ ఫైనల్ గెలిచిన అనంతరం నోవాక్ జోకోవిచ్...

సారాంశం

వింబుల్డన్ ఫైనల్‌ గెలిచి, కెరీర్‌లో 20వ గ్రాండ్‌స్లామ్స్ పూర్తిచేసుకున్న నోవాక్ జోకోవిచ్... వింబుల్డన్ విజయానంతరం బుల్లి అభిమానికి బహుమతిగా తన రాకెట్‌ని బహుకరించిన నెం.1 టెన్నిస్ స్టార్...

సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్‌కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. జోకోవిచ్‌కి ఇంతటి ఫాలోయింగ్ రావడానికి ప్రధాన కారణం ఆటతో పాటు అభిమానులతో  అతని ప్రవర్తనే. బాల్ బాయ్స్ దగ్గర్నుంచి తన స్టాఫ్, మిగిలిన సహాయ సిబ్బందితో ఎంతో ప్రేమగా, క్రేజీగా నడుచుకుంటూ ఉంటాడు నోవాక్ జోకోవిచ్...

వింబుల్డన్ ఫైనల్‌లో ఇటలీకి చెందిన మాట్టెయో బెర్రెట్టినీని నాలుగు సెట్లలో ఓడించి, 20వ గ్రాండ్‌స్లామ్ సొంతం చేసుకున్నాడు నోవాక్ జోకోవిచ్. ఫైనల్ ముగిసిన తర్వాత తన టెన్నిస్ రాకెట్‌ను ఓ బుల్లి అభిమానికి కానుకగా ఇచ్చాడు జోకో...

నోవాక్ నెం.1 అంటూ ఓ చిన్ని కార్డును పట్టుకుని నిల్చున్న చిన్నారిని చూసి ముచ్చటపడిన జోకోవిచ్, ఆమె దగ్గరికి వెళ్లి తన రాకెట్‌ను బహుకరించాడు. తన ఫెవరెట్ స్టార్ స్వయంగా గిఫ్ట్ ఇవ్వడంతో ఆ బుల్లి ఫ్యాన్స్, సంబరపడిపోగా స్టేడియంలోని ప్రేక్షకులందరూ చప్పట్లతో జోకోవిచ్‌ చేసిన పనిని అభినందించారు...

ఈ ఫోటోను వింబుల్డన్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా... ‘తను క్యూట్‌గా ఉందంటూ’ కామెంట్ చేశాడు నోవాక్ జోకోవిచ్... 20 గ్రాండ్‌స్లామ్స్ పూర్తిచేసుకున్న నోవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్ రికార్డులను సమం చేశాడు.

PREV
click me!

Recommended Stories

స్నేహితుడ్ని బూట్లు అడుక్కుని ట్రయిల్స్‌కు.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో భారీ ధరకు
ఆ ప్లేయర్స్‌ను కొన్నది అందుకే.! ధోని రిటైర్మెంట్ పక్కా.. నెక్స్ట్ ఏంటంటే.?