Boxing: ఫైన‌ల్ కు చేరిన నిఖ‌త్ జ‌రీన్.. గోల్డ్ మెడ‌ల్ రేసులో ఆరుగులు భార‌త బాక్స‌ర్లు

By Mahesh RajamoniFirst Published Feb 11, 2024, 1:57 PM IST
Highlights

Strandja Memorial - Nikhat Zareen : 75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ లో భార‌త స్టార్ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ మ‌రోసారి తిరుగులేని పంచ్‌ పవర్‌తో ఫైనల్లోకి  దూసుకెళ్లింది. నిఖ‌త్ తో పాటు మ‌రో ఆరుగురు భారత బాక్సర్లు గోల్డ్ మెడ‌ల్ రేసులో ఉన్నారు. 
 

Boxing, Strandja Memorial - Nikhat Zareen : 75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్, భార‌త స్టార్ బాక్స‌ర్ నిఖత్ జరీన్ ఫైన‌ల్ లోకి దూసుకెళ్లింది. తిరుగులేని పంచ్‌ పవర్‌తో ప్ర‌త్య‌ర్థిపై విరుచుకుప‌డుతూ గోల్డ్ మెడ‌ల్ రేసులోకి వ‌చ్చింది. అలాగే, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్ కూడా ఫైన‌ల్ చేరుకున్నాడు. నిఖత్, అమిత్ లతో పాటు మరో నలుగురు భారత బాక్సర్లు కూడా ఫైనల్స్ కు చేరుకున్నారు.

నిఖ‌త్ జ‌రీన్ పంచ్ ప‌వ‌ర్.. 

75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ తొలి సెమీఫైనల్లో నిఖత్ జరీన్ (50 కేజీల విభాగం) జ్లాటిస్లావా చుకనోవాతో తలపడింది. నిఖత్ మొదట్ లో ఆచితూచి వ్యవహరించి. ఆ త‌ర్వాత త‌న పంచ్ ప‌వ‌ర్ ఎంటో చూపిస్తూ విరుచుకుప‌డింది. తొలి  రౌండ్ ను 3-2తో గెలుచుకుంది. తర్వాతి రౌండ్ లో ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వ‌లేదు. నిఖత్ పూర్తి ఆధిపత్యం కనబరిచింది. తన ఫామ్ ను చివరి రౌండ్ కు కూడా తీసుకెళ్లిన ఆమె చివరికి 5-0 తేడాతో మ్యాచ్ ను గెలుచుకుంది. ఆదివారం జరిగే గోల్డ్ మెడల్ పోరులో నిఖత్ ఉజ్బెకిస్థాన్ క్రీడాకారిణి సబీనా బొబోకులోవాతో తలపడనుంది.

గోల్డ్ మెడ‌ల్ రేసులో ఆరుగురు భార‌త బాక్స‌ర్లు..

మరోవైపు అమిత్ పంఘాల్ (51 కేజీలు) 5-0తో గుముస్ సామెట్ (టర్కీ)పై విజయం సాధించాడు. తన అనుభవాన్నంతా ఉపయోగించి, స్మార్ట్ ఫుట్వర్క్ ను ప్రదర్శిస్తూ తొలిరౌండ్ నుంచే అధిప‌త్యం చేలాయిస్తూ సునాయాస విజయం సాధించాడు. ఆదివారం కజకిస్థాన్ కు చెందిన ప్రస్తుత ప్రపంచ చాంపియన్ సంజార్ తాష్కెన్ బేతో తలపడనున్నాడు.

U19 World Cup 2024 Final: ఆస్ట్రేలియా-భార‌త్ ఫైనల్..

అరుంధతి చౌదరి (66 కేజీలు) తన 75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ సెమీఫైనల్ మ్యాచ్ లో స్లొవేకియాకు చెందిన జెస్సికా ట్రిబెలోవాపై 5-0 తేడాతో విజయం సాధించింది. దూకుడుగా ఆడిన ఆమె బౌట్ పై ఆధిపత్యం చెలాయిస్తూ ప్రతి రౌండ్ ను 5-0 స్కోరుతో గెలుచుకుంది. అరుంధతి ఆదివారం ఆసియా ఛాంపియన్ యాంగ్ లియు (చైనా)తో తలపడనుంది.

75వ స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నమెంట్ లో బరున్ సింగ్ షగోల్షెమ్ (48 కేజీలు) అల్జీరియాకు చెందిన ఖెనౌస్సీ కమెల్ ను 5-0 తేడాతో ఓడించి ఫైనల్ కు చేరాడు. బరున్ తన అద్భుత‌మైన పంచ్ ల‌తో చెల‌రేగాడు. ఆదివారం జరిగే ఫైనల్లో కిర్గిజిస్తాన్ కు చెందిన ఖోడ్జివ్ అన్వర్జాన్ తో తలపడనున్నాడు.

Under 19 World Cup: అండ‌ర్19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ దే పైచేయి.. !

click me!