బెంగళూరు టెస్టులో మురళీ విజయ్ సెంచరీ

First Published Jun 14, 2018, 4:24 PM IST
Highlights

145 బంతుల్లో శతకం సాధించిన మురళీ విజయ్

అప్ఘానిస్థాన్ జట్టుతో బెంగళూరులో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ లో భారత బ్యాట్స్ మెన్స్ దూకుడు ప్రదర్శించాడు. ఒపెనర్లు ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కారు. మొదట శిఖర్ దావన్ వేగంగా ఆడి కేవలం 84 బంతుల్లోనే సెంచరీ సాధించి 107 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుుతూ మరో ఒపెనర్ మురళీ విజయ్ కూడా తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.  

మరళీ విజయ్ 145 బంతుల్లో సెంచరీ సాధించారు. అప్ఘాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ, చక్కటి క్లాస్ షాట్లతో విజయ్ తన సెంచరీ మార్కుకు చేరుకున్నాడు. మొదట తనతో ఒపెనింగ్ వచ్చిన ధావన్ కు ఎక్కువ స్ట్రైక్ రొటేట్ చేసిన విజయ్ అతడు ఔటయ్యాక రెచ్చిపోయాడు. ఇలా కాస్త వేగాన్ని పెంచి టెస్ట్ కెరీర్ లో 12 వ సెంచరీని సాధించాడు. 

తొలి వికెట్ కు 168 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఒపెనింగ్ జోడీని అప్ఘాన్ బౌలర్ అహ్మద్ జాయ్ విడదీశాడు. ఇతడి బౌలింగ్ లో మరో షాట్ కు ప్రయత్నించిన శిఖర్ ధావన్ మొహమ్మద్ నబీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత విజయ్ కూడా దాటిగా ఆడి మరో శతకాన్ని నమోదు చేశాడు. మరో బ్యాట్ మెన్  లోకేష్ రాహుల్ కూడా 44 పరుగులు సాధించి అర్థశతకానికి దగ్గరయ్యాడు. భారత ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడుతుండటంతో భారత్ భారీ స్కోరు దిశగా వెళుతోంది. 

 
 

click me!