ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

Published : Nov 17, 2018, 04:40 PM IST
ఏపీలో ధోనీ క్రికెట్ అకాడమీ.. ప్రభుత్వంతో ఒప్పందం

సారాంశం

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఏపీలో క్రికెట్ అకాడమీ  ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఆయన ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. సుమారు రూ.60కోట్ల వ్యయంతో విశాఖలో ఈ అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.

శనివారం ధోనీ కి చెందిన ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఫ్రైవేట్ లిమిటె్ సంస్థ ఎండీ మిహిర్ దివాకర్.. సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి గంటా శ్రీనివాసరావులతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. 

ఈ ఒప్పందంలో భాగంగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు దశల్లో క్రికెట్ అకాడమీతోపాటు, ఇంటర్నేషనల్ స్కూల్ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఈ అకాడమీని క్రికెట్ కే పరిమితం చేయకుండా.. ఇతర క్రీడలకూ ఉపయోగపడేలా ఇండోర్, ఔట్ డోర్ స్టేడియాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.

PREV
click me!

Recommended Stories

సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Lionel Messi: బాస్ ఈజ్ బ్యాక్.. ఎవడ్రా ఆపేది ! ఫిపా వరల్డ్ కప్‌లో మెస్సి హిస్టారికల్ రికార్డ్