నిధుల దుర్వినియోగం.. మాజీ క్రికెటర్ వెంకటపతిరాజుకి ఏసీబీ నోటీసులు

Published : Jul 28, 2021, 09:13 AM ISTUpdated : Jul 28, 2021, 09:16 AM IST
నిధుల దుర్వినియోగం.. మాజీ క్రికెటర్ వెంకటపతిరాజుకి ఏసీబీ నోటీసులు

సారాంశం

ఈ తొమ్మిది మందిలో ఒకరు చనిపోగా.. మిగిలిన ఎనిమిది మందికి నోటీసులు అందాయి. వారిలో ముగ్గురు  యాదగిరి, కే. శ్రీనివాసరావు, ఆర్ దేవరాజ్ లను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు.

హైదరాబాద్ క్రికెట్  అసోసియేషన్ కి చెందిన మాజీ అధికారులు ముగ్గురు ఏసీబీ వలలో చిక్కారు. వీరిని అధికారులు లోకల్ కోర్టులో హాజరుపరచగా.. నిందితులు.. బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. 

మూడు రోజుల క్రితం ఏసీబీ కోర్టు  తొమ్మిది మంది ప్రస్తుతం హెచ్ సీఏ ఆఫీస్ బేరర్లు,  మాజీ అధికారులకు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. 2011, 2014 ల మధ్య జరిగిక అవకతకలు, నిధుల దుర్వినియోగం కేసులకు సంబంధించి.. కొందరు అధికారులు కోర్టుకు హాజరుకావడం లేదు. ఈ నేపథ్యంలో.. వీరికి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఈ తొమ్మిది మందిలో ఒకరు చనిపోగా.. మిగిలిన ఎనిమిది మందికి నోటీసులు అందాయి. వారిలో ముగ్గురు  యాదగిరి, కే. శ్రీనివాసరావు, ఆర్ దేవరాజ్ లను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరిచారు. మరో నలుగురు నిందితులు మాత్రం.. ఈ నోటీసులను పట్టించుకోలేదు. వారిలో.. అంతర్జాతీయ మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు కూడా ఉండటం గమనార్హం. మరి దీనిపై వీరు ఎలా స్పందిస్తారో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Team India: సూర్యకుమార్ యాదవ్‌కు షాక్.. కెప్టెన్సీ గోవిందా !
IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే