మెల్‌బోర్న్ టెస్ట్: ముగిసిన తొలి రోజు ఆట, భారత్ 215/2

By sivanagaprasad KodatiFirst Published Dec 26, 2018, 7:23 AM IST
Highlights

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. 

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. టాస్ గెలిచిన టీమిండియా సారథి విరాట్ కోహ్లీ  బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్, హనుమ విహారీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే ఈ జోడీ కుదురుకుంటున్న సమయంలో కమ్మిన్స్ బౌలింగ్‌లో విహారీ ఔటయ్యాడు. అయితే టెస్టుల్లో అరంగేట్రం చేసిన మయాంక్ మాత్రం ఎక్కడా తడబడకుండా బ్యాటింగ్ చేసి స్కోరు బోర్డును పరగులు పెట్టించాడు.

ఈ క్రమంలో అర్థసెంచరీ పూర్తి చేసుకుని అరంగేట్రం టెస్టులోనే హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్ల జాబితాలో చేరాడు. పుజారాతో కలిసి దూకుడుగా ఆడుతూ సెంచరి దిశగా వెళుతున్న మయాంక్ 76 పరుగుల స్కోరు వద్ద కమ్మిన్స్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

అనంతరం కోహ్లీ, పుజారాల జంట ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఇద్దరు ఆచితూచి ఆడుతూ అడపా దడపా బౌండరీలు బాదుతూ స్కోరును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో 152 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో పుజారా అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు.

కోహ్లీ కూడా ధాటిగా ఆడి 47 బంతుల్లో అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 89 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. పుజారా 68, కోహ్లీ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

click me!