ఆ పుణ్యం ద్రవిడ్‌ సర్‌దే.. లేకుంటే: మయాంక్ అగర్వాల్

By sivanagaprasad kodatiFirst Published Oct 1, 2018, 12:15 PM IST
Highlights

టీమిండియాలో తనకు స్థానం దక్కడం పట్ల మయాంక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. దీని వెనుక రాహుల్ ద్రవిడ్ ప్రొత్సాహమే కారణమని మయాంక్ అన్నాడు.

టీమిండియాలో తనకు స్థానం దక్కడం పట్ల మయాంక్ అగర్వాల్ హర్షం వ్యక్తం చేశాడు. దీని వెనుక రాహుల్ ద్రవిడ్ ప్రొత్సాహమే కారణమని మయాంక్ అన్నాడు. భారత్- ఏ జట్టు కోచ్‌గా ‘‘ ఏం జరిగినా.. జరగబోతున్నా.. పరుగులు చేయడానికే కట్టుబడి ఉండు’’ అని ద్రవిడ్ ఇచ్చిన సలహాతోనే తాను దేశవాళీ క్రికెట్‌లో రాణించానని మయాంక్ అన్నాడు.

ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా బాధ్యత.. అంతే తప్ప ఇతర వ్యవహారాల గురించి తాను ఆలోచించనన్నాడు.. నా ఆటను ఇలాగే కొనసాగించడం.. ప్రతి మ్యాచ్‌లో పరుగులు చేస్తూ ఆటతీరును మెరుగుపరుచుకోవడమే తన బాధ్యతని మయాంక్ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌తో త్వరలో జరగబోతున్న రెండు టెస్టుల సిరీస్‌కు 15 మంది జట్టు సభ్యులను బీసీసీఐ ప్రకటించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్‌, విజయ్‌ల వరుస వైఫల్యాల నేపథ్యంలో బోర్డు వారిపై వేటు వేసి.. భారత- ఏ జట్టు తరపున అద్బుతంగా రాణిస్తున్న మయాంక్‌కు అవకాశం ఇచ్చారు. 
 

click me!