రక్తం కారుతున్న కాలుతోనే ఆడి, తన జట్టును ఫైనల్ చేర్చిన లియోనెల్ మెస్సీ...
కోపా అమెరికా కప్‌లో కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో ఘటన...
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీకి ఆటపై ఉన్న అంకితభావానికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఈ సంఘటన. కోపా అమెరికా టోర్నీలో కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో రక్తం కారుతున్న కాలుతోనే ఆడి, తన జట్టును ఫైనల్ చేర్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు లియోనెల్ మెస్సీ...
అర్జెంటీనా, కొలంబియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గాయపడిన మెస్సీ, నొప్పిని కొనసాగిస్తూనే ఆటను కొనసాగించాడు. నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లూ చెరో గోల్ చేయడంతో ఆటను ఎక్‌ట్రా టైంకి పొడగించారు. అదనపు సమయంలో కూడా రిజల్ట్ రాకపోవడంతో పెనాల్టీ రౌండ్‌తో ఫలితం తేల్చాల్సి వచ్చింది.
undefined
కొలింబియా ప్లేయర్ ఫ్రాంక్ ఫబ్రాతో జరిగిన ట్యాకిల్ కారణంగా ఆట 55వ నిమిషంలో మెస్సీ కాలికి గాయమైంది. రక్తం కారుతున్నప్పటికీ నొప్పిని భరిస్తూనే ఆటను కొనసాగించాడు మెస్సీ. ఈ ఫాల్ చేసినందుకు ఫబ్రాకి ఎల్లో కార్డ్ చూపించారు రిఫరీ...
4Goals , 5 assists = Straight to the final with a bleeding ankle 🩸.... We don sacrifice GOAT blood for the final ... congrats in advance Messi/Argentina/Barca/Culers pic.twitter.com/a75BrVcDaj
— Ogedengbe agbogungboro ✊🏿✊🏿 (@leumas_mahni_og)ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ కావడంతో రక్తం కారుతున్నా, మ్యాచ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు మెస్సీ. కెప్టెన్ డెడికేషన్ నుంచి స్ఫూర్తిపొందిన అర్జెంటీనా ప్లేయర్లు, పెనాల్టీ రౌండ్‌లో 3-2 తేడాతో జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంత కోపా అమెరికా లీగ్ ఫైనల్‌కి దూసుకెళ్లింది అర్జెంటీనా జట్టు.