నిప్పులు చేరిగే వేగంతో బంతులు...నిలబడి సెంచరీ చేసిన కుంబ్లే

By sivanagaprasad KodatiFirst Published Aug 10, 2018, 5:37 PM IST
Highlights

నిప్పులు చేరిగే బంతుల మధ్య... తలను తాకుతున్న బౌన్సర్ల మధ్య  కాకలు తీరిన బ్యాట్స్‌మెన్లు కూడా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడతారు.. అలాంటిది ఒక బౌలర్

నిప్పులు చేరిగే బంతుల మధ్య... తలను తాకుతున్న బౌన్సర్ల మధ్య  కాకలు తీరిన బ్యాట్స్‌మెన్లు కూడా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడతారు.. అలాంటిది ఒక బౌలర్.. అలాంటి పిచ్‌పై సెంచరీ చేస్తే అది నిజంగా విశేషమే కదా. ఆ ఫీట్‌ను సాధించాడు టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్‌లో పర్యటించింది.

లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్ డ్రా కాగా.. ట్రెంట్‌బ్రిడ్జిలో జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా నెగ్గింది. ఓవల్‌లో జరిగిన మూడో టెస్టులో టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ చేలరేగడంతో.. టీమిండియా 664 పరుగులు చేసింది.

ఇదే మ్యాచ్‌లో చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కుంబ్లే 16 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత బంతితోనూ విజృంభించి 5 వికెట్లు తీసి జట్టును గెలిపించాడు. తద్వారా మూడు టెస్టుల మ్యాచ్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది. కెరీర్‌లో 503 మ్యాచ్‌లు ఆడిన కుంబ్లే రిటైర్‌మెంట్‌ చివర్లో  సెంచరీ చేశాడు. అంతేకాదు.. భారత్ తరపున పెద్ద వయస్సులో శతకం సాధించినన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. 

click me!